కార్మికుల పక్షాన… వందేండ్ల పోరాటం

by Sridhar Babu |   ( Updated:2020-10-15 08:11:12.0  )
కార్మికుల పక్షాన… వందేండ్ల పోరాటం
X

దిశ, భూపాలపల్లి: భూపాలపల్లి కోల్బెల్ట్ ఏరియాలో ఏఐటీయూసీ ఎర్రదండు కవాతు నిర్వహించింది. కార్మికుల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా కార్మిక వర్గం నుంచే పురుడు పోసుకున్న ఏఐటీయూసీ అక్టోబర్ 31 నాటికి వందేండ్లు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ఆ సంఘం ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఏఐటీయూసీ జనరల్ సెక్రెటరీ సీతారామయ్య నేతృత్వంలో ఎస్సీడబ్ల్యూయూ, ఏఐటీయూసీ కేంద్ర నాయకత్వం సేవ్ సింగరేణి యాత్రకు పిలుపునిచ్చింది. ఈ యాత్ర ఈ నెల 5న గోలేటి నుంచి ప్రారంభం కాగా గురువారం భూపాలపల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా 100 మీటర్ల అరుణ పతాకంతో పెద్ద ఎత్తున కవాతు నిర్వహించారు.

అనంతరం ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.బోస్, గౌరవ అధ్యక్షుడు కూనంనేని సాంబశివరావు, అధ్యక్షుడు వై.గట్టయ్య, ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య, డిప్యూటీ జనరల్ సెక్రటరీలు బాజీ సైదా, కొరిమి రాజ్ కుమార్, బ్రాంచి కార్యదర్శి మోటపలుకుల రమేష్‌లు పాల్గొని మాట్లాడారు. రాబోయే రోజుల్లో కార్మికులంతా ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న ప్రభుత్వాల పట్ల సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దేశంలో మొట్టమొదటగా స్థాపించబడిన కార్మికుల ట్రేడ్ యూనియన్ ఏఐటీయూసీ అన్నారు.



Next Story

Most Viewed