- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మేఘాలయా గవర్నర్‌గా సత్యపాల్ మాలిక్
X
న్యూఢిల్లీ: గోవా గవర్నర్ సత్యపాల్ మాలిక్ మేఘాలయా గవర్నర్‌గా బదిలీ అయ్యారు. రెండేళ్లు త్రిపురకు తర్వాత మూడేళ్లు మేఘాలయకు గవర్నర్‌గా సేవలందించి ఐదేళ్ల కాలాన్ని ముగించుకున్న తథాగత రాయ్ స్థానంలో సత్యపాల్ మాలిక్ వెళ్లనున్నారు. కాగా, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీ గోవా గవర్నర్‌గా అదనపు బాధ్యతలు తీసుకోనున్నట్టు రాష్ట్రపతి భవన్ నుంచి వెలువడిన ప్రకటన పేర్కొంది. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే అధికరణం 370 నిర్వీర్యం చేసినప్పుడు ఆ రాష్ట్రానికి సత్యపాల్ మాలిక్ గవర్నర్‌గా విధులు నిర్వహించిన సంగతి తెలిసిందే. అనంతరం గోవా గవర్నర్‌గా బదిలీ అయ్యారు. జమ్ము కశ్మీర్‌కు ఏడాది కాలంగా గవర్నర్‌గా సేవలందించడానికి పూర్వం బీహార్ గవర్నర్‌గా కొనసాగారు. మొత్తంగా సత్యపాల్ మాలిక్ రెండేళ్ల కాలంలో మూడు సార్లు బదిలీ అయ్యారు.
Advertisement
Next Story