ఈ రాశివారికి దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి

by Hamsa |
ఈ రాశివారికి దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి
X

ప్రదేశము : హైదరాబాద్, ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : శ్రావణమాసం
ఋతువు : వర్ష ఋతువు
వారము : శనివారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : షష్టి (నిన్న రాత్రి 6 గం॥ 53 ని॥ నుంచి ఈరోజు రాత్రి 8 గం॥ 59 ని॥ వరకు)
నక్షత్రం : భరణి (ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 51 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 3 గం॥ 36 ని॥ వరకు)
యోగము : వృద్ధి
కరణం : గరజ
వర్జ్యం : (ఈరోజు ఉదయం 11 గం॥ 33 ని॥ నుంచి ఈరోజు మధ్యాహ్నం 1 గం॥ 20 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు రాత్రి 10 గం॥ 15 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 0 గం॥ 2 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 7 గం॥ 41 ని॥ నుంచి 8 గం॥ 31 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 9 గం॥ 8 ని॥ నుంచి 10 గం॥ 42 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 6 గం॥ 1 ని॥ నుంచి 7 గం॥ 35 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు మధ్యాహ్నం 1 గం॥ 50 ని॥ నుంచి 3 గం॥ 24 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 1 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 33 ని॥ లకు
సూర్యరాశి : సింహము
చంద్రరాశి : మేషము

మేష రాశి : ఈరోజు పక్షులకు గింజలు పెట్టండి. అన్నీ మంచి ఫలితాలు వస్తాయి. పనికిమాలిన భయాలను వదిలిపెట్టండి ధైర్యంగా ఉండండి. ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు మీ వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోండి. వ్యాపారులకు లాభాలు. ఆదాయం పరవాలేదు. ఖర్చులను అదుపులో ఉంచుకోండి. అధిక శ్రమ వలన కాళ్ళనొప్పులు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన మీ వైవాహిక జీవితంలో ఈరోజు ఒక ఆనందకరమైన రోజు.

వృషభ రాశి : అనుకున్న కార్యాలను సాధించాలంటే సరైన ప్రణాళిక ఆశావహ దృక్పథం అవసరం. మీరు ఈ మధ్యనే కొత్తగా బిజినెస్ ప్రారంభించి ఉంటే అన్ని వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. లాభాల కోసం ఎదురు చూడండి. కొంతమందికి అనుకోని ప్రయాణాలు. పెళ్లి కాని వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం. మీ మొండితనం కుటుంబ సభ్యుల మీద చూపించకండి. మీరు ఇల్లు అద్దెకు ఇద్దామనుకుంటే మంచి వ్యక్తుల కోసం చూడండి. ఆఫీసు పనులను సకాలంలో పూర్తి చేయాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. నిరుద్యోగులు ఉద్యోగం కోసం మరింత కష్టపడాలి. ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువ. సీజన్ మార్పు వలన దగ్గు జలుబు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన అటువంటి వ్యక్తి భర్తగా లభించినందుకు ఆనందిస్తారు.

మిధున రాశి : అనుకున్న కార్యాలను ఆత్మవిశ్వాసంతో సాధిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలను ధైర్యంగా తీసుకుంటారు. సవాళ్ళను ఎదుర్కోవడానికి తెలివితేటలు ఉపయోగించవలసి వస్తుంది. మీ దుబారా ఖర్చుల మీద కుటుంబ సభ్యులు ముఖ్యంగా పెద్దవారు బాధపడతారు. ఆఫీసులో పనులను మీ శక్తి సామర్ధ్యాలతో పూర్తిచేస్తారు. అందరి ప్రశంసలు పొందుతారు ఆదాయం బాగుంది పొదుపు చేస్తారు. కొందరు ఈ ప్రపంచం మొత్తాన్ని వదిలేసి దూరంగా ఒంటరిగా గడపాలని కోరుకుంటారు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.

కర్కాటక రాశి : అదృష్టం మీ పక్షాన ఉంది. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. డబ్బు ఇబ్బంది వలన ఆగిన పనులన్నీ మళ్లీ మొదలు పెడతారు. మీ చిరకాల స్వప్నం నెరవేరే అవకాశం. వ్యాపారులకు లాభాలు. ఆఫీసు పనులను సకాలంలో పూర్తి చేస్తారు కొంతమందికి ఆఫీసు టూర్స్ ఫిట్ నెస్ కొరకు చేస్తున్న ప్రయత్నాలు సఫలం. స్థిరాస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. కావాల్సినంత ధనం చేతికందుతుంది పొదుపు చేస్తారు. కుటుంబ సభ్యులతో పరుషంగా మాట్లాడకండి ముఖ్యంగా మీ పెద్ద వారితో. ఈ రాశి స్త్రీలకు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజు.

సింహరాశి : ఆధ్యాత్మిక మార్గం మీద ఆసక్తి కనబరుస్తారు దాని వలన మానసిక ప్రశాంతత. తొందరగా రెచ్చిపోయే అలవాటును తగ్గించుకోండి. దాని వలన ఇబ్బందులు. అధిక శ్రమ ఉన్నప్పటికీ ఆఫీస్ పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. దురలవాట్లకు దూరంగా ఉండండి. కొంతమందికి హాలిడే ట్రిప్. అనుకోని అతిథి రాక వలన మీ సహాయం వృధా. ఆదాయం, ఖర్చులను బ్యాలెన్స్ చేయలేక సతమతమవుతారు ఈ రాక్షసులకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజు.

కన్య రాశి : కష్టానికి తగిన ప్రతిఫలం లభించినందుకు ఆనందం. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. అనవసరపు ఖర్చులు వలన డబ్బుకు ఇబ్బంది దీని గురించి కుటుంబ సభ్యులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకోండి. ఆఫీసు పనులలో అధిక శ్రమ. పనుల పై శ్రద్ధ పెట్టి పూర్తి చేయడానికి ప్రయత్నించండి కుటుంబ సభ్యులకు కొంత సమయం కేటాయించండి వారు మీ కోసం ఎదురు చూస్తున్నారు. అధిక జనాభా వలన తలనొప్పి ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక మర్చిపోలేని ఆనందకరమైన రోజు.

తులారాశి : ఆఫీసులో మీ ప్రతిభకు తగిన గుర్తింపు రాలేదని మానసిక అశాంతి. వ్యాపారులకు లాభాలు. కొంతమంది రొటీన్ వ్యవహారాలను వదిలేసి హాలిడే ట్రిప్ వేస్తారు. కొంతమంది ఉద్యోగులకు జీతాలు పెరుగుదల. ఫిట్నెస్ కొరకు చేస్తున్న ప్రయత్నాల వలన మీ శరీరం ఆకర్షణీయంగా తయారవుతుంది. ఇకనుంచి అతిగా తినకండి. దైవ దర్శనం వలన మానసిక బలం. విద్యార్థులు మీ డౌట్స్ ఉంటే వెంటనే క్లారిఫై చేసుకోండి లేకుంటే తర్వాత సబ్జెక్టు అర్థం కాక ఇబ్బంది పడతారు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజు.

వృశ్చిక రాశి : సరైన కమ్యూనికేషన్ చెయ్యలేక పోవటం వలన అందరినీ గందరగోళంలోకి నెడతారు. అనవసరమైన వాదోపవాదాల వలన సమయం వృధా ఇది గుర్తించండి. హాలిడే ట్రిప్ చాలా ఖర్చుతో కూడుకున్నది అవుతుంది. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. బంగారం వ్యాపారులకు లాభాలు. ఫిట్నెస్ కొరకు చేస్తున్న ప్రయత్నాలు సఫలం. ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేస్తారు పై అధికారుల ప్రశంసలు. కొంతమంది ఉద్యోగులకు ప్రమోషన్. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తల సామరస్య ధోరణి వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజు.

ధనుస్సు రాశి : అనవసరపు భయాలను వదిలిపెట్టండి. ఆశావహ దృక్పథంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఆరోగ్యం పూర్తిగా చక్కబడుతుంది. కుటుంబ అవసరాలకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారులు లాభాలు రావడం లేదని బాధపడకండి తొందరలోనే అన్నీ సర్దుకుంటాయి. ఆఫీసులో పనులను సకాలంలో పెండింగ్ లేకుండా పూర్తి చేయటానికి ప్రయత్నించండి పై అధికారులు గమనిస్తున్నారు. ఫిట్ నెస్ కొరకు చేస్తున్న ప్రయత్నాల వలన మీ శరీరం ఆకర్షణీయంగా తయారవుతుంది. ఆదాయం బాగుంది అనవసరపు ఖర్చులను నివారించండి. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు పాత విషయాలను మర్చిపోయి మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు నడపండి.

మకర రాశి : సరైన కమ్యూనికేషన్ చెయ్యలేక పోవటం వలన అందర్నీ గందరగోళంలోకి నెడతారు. మనసులో నుంచి అనవసరమైన భయాలను తుడిచేయండి. సహనం వహించండి ఆరోగ్యంపట్ల జాగ్రత్త వహించండి. డబ్బు వ్యవహారాలపై ఇతరులతో గొడవ పడే అవకాశం జాగ్రత్తగా ఉండండి. మరింత సంపాదన కొరకు నూతన మార్గాలను అన్వేషిస్తారు.ఆఫీసు పనులలో అదనపు బాధ్యతలు. పనులను సకాలంలో పూర్తి చేయటానికి ప్రయత్నించండి. ఒక శుభవార్త వలన కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. విద్యార్థులు మీ డౌట్స్ ఉంటే వెంటనే క్లారిఫై చేసుకోండి లేకుంటే తర్వాత సబ్జెక్టు అర్థం కాక ఇబ్బంది పడతారు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త అనవసరమైన భయాందోళనలతో మీతో సరిగ్గా గడపలేక పోతున్నందుకు మానసిక అశాంతి.

కుంభరాశి : ఉత్సాహంగా ఉండండి. లేకపోతే ముఖ్యమైన అవకాశాలు వదులుకోవాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో పరుషంగా మాట్లాడకండి ముఖ్యంగా పెద్ద వారితో. కొంతమందికి ఆఫీస్ పరంగా విదేశ ప్రయాణానికి అవకాశం. స్థిరాస్తి వ్యవహారాలను వాయిదా వేయండి. ఫిట్నెస్ కొరకు మళ్లీ ప్రయత్నాలు చేస్తారు. మీ పిల్లల ప్రగతి మీకు ఎంతో గర్వకారణం. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు ముఖ్యంగా బిపి షుగర్ పేషెంట్స్ జాగ్రత్త వహించండి ఆఫీసు పనులలో మీ శక్తిసామర్థ్యాలు, మీ నిర్ణయాలు అందరి ప్రశంసలు పొందుతాయి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక మర్చిపోలేని ఆనందకరమైన రోజు.

saturday అనుకున్న కార్యాలను సాధించాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి కొంతమంది హాలిడే ట్రిప్ కు ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది కొత్త ఇంటికి మారడానికి ప్రయత్నాలు చేస్తారు. కొంతమందికి ఆఫీస్ పరంగా విదేశ ప్రయాణానికి అవకాశం.అనుకోని ధనలాభము. షాపింగ్ చేస్తారు. దుబారా ఖర్చులు పెట్టకండి అధిక శ్రమ వలన వెన్ను నొప్పి. తగినంత విశ్రాంతి తీసుకోండి. బంధువుల సహకారం తో వ్యాపారంలో లాభాలు సాధిస్తారు. ఇబ్బందులకు గురి చేసే వ్యక్తుల నుంచి దూరంగా ఉండండి ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.

Advertisement

Next Story