పెరిగే సముద్ర మట్టాన్ని కొలవడానికి స్పేస్ ఎక్స్ శాటిలైట్‌లు

by Harish |
పెరిగే సముద్ర మట్టాన్ని కొలవడానికి స్పేస్ ఎక్స్ శాటిలైట్‌లు
X

దిశ, వెబ్‌డెస్క్:

భూమి చుట్టూ.. కక్ష్యలో తిరుగుతూ భూమ్మీద సముద్ర మట్టాల పెరుగుదలను ఎప్పటికప్పుడు కొలవడానికి త్వరలో ఒక శాటిలైట్‌ను స్పేస్ ఎక్స్ పంపించనున్నట్లు తెలుస్తోంది. ‘సెంటినెల్-6 మైకేల్ ఫ్రైలిచ్’ అని పిలిచే ఈ శాటిలైట్ ప్రతి పది రోజులకు ఒకసారి భూమ్మీది మహాసముద్రాల మట్టాన్ని గణిస్తుంది. తద్వారా తీరప్రాంతాల క్రమక్షయం కారణంగా సముద్ర మట్టాలు ఎంతమేరకు పెరిగాయనే డేటాను శాస్త్రవేత్తలకు పంపిస్తుంది. ఈ శాటిలైట్‌లో ఉన్న డిజిటల్ అల్టీమీటర్‌లు సముద్ర మట్టంలో మిల్లీ మీటర్ తేడా వచ్చినా గుర్తించగలవు. అది భూమి నుంచి 830 మైళ్ల ఎత్తులో తిరుగుతూ మట్టాన్ని గుర్తించగలవు.

ఈ శాటిలైట్ పంపిన డేటా ఆధారంగా భూమ్మీద తీరప్రాంతాల్లో వరదలు నివారించడంలో శాస్త్రవేత్తలు, పాలసీ మేకర్‌లు నిర్ణయం తీసుకోవడం సులభతరం అవుతుంది. నవంబర్ 10న ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్ ఎయిర్‌ఫోర్స్ బేస్ నుంచి దీన్ని పంపించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను యురోపియన్ స్పేస్ ఏజెన్సీ, నాసా కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. శాటిలైట్ లాంచ్ కోసం నాసా, స్పేస్ ఎక్స్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా గత మూడు దశాబ్ధాలుగా సముద్ర మట్టాల మార్పు గురించి సరైన డేటా లేని లోటు తీరనుంది.

Advertisement

Next Story