- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆది బర్త్‌డే కానుకగా ‘శశి’
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్ : శ్రీనివాస్ నాయుడు దర్శకత్వంలో ఆది సాయికుమార్ ‘శశి’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘శశి’ సినిమా షూటింగ్ పూర్తి కాగా, డబ్బింగ్ కూడా ఇటీవలే పూర్తి చేసుకుంది. డిసెంబర్ 23న ఆది సాయి కుమార్ పుట్టినరోజు సందర్భంగా ‘శశి’ సినిమా టీజర్ విడుదల చేస్తున్నట్లు ఫిల్మ్ మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రంలో ఆది సరసన సురభి నటిస్తుండగా, రెండో హీరోయిన్‌గా రాశీ సింగ్ చేస్తోంది. అరుణ్ చిలువేరు సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, తులసి, జయప్రకాష్, రాజీవ్ కనకాల, అజయ్, వైవా హర్షలు కీలక పాత్రలు పోషించారు. ఆది కెరీర్ విషయానికొస్తే 2019లో బుర్రకథ, జోడి, ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమాలు చేయగా, 2020లో షూటింగ్ మొదలుపెట్టిన ‘జంగిల్, ‘శశి’లు 2021లో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
Advertisement
Next Story