- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వ్యాక్సిన్ వికటించి సర్పంచ్ మృతి..?
by Sumithra |
X
దిశ, షాద్ నగర్ : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం లింగధన గ్రామ మహిళా సర్పంచ్ మయూరి(42) ఆకస్మికంగా మృతి చెందారు. బుధవారం రాత్రి పల్స్ పడిపోగా చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన హైదరాబాద్ కు తీసుకువెళుతుండగా మార్గమధ్యంలో మృతిచెందినట్లు గ్రామస్థులు తెలిపారు.
ఈ నెల 12న ఆమె కేశంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆ రోజు నుంచి ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిసింది. రాత్రి అకస్మాత్తుగా పల్స్ పడిపోవడంతో ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామ సర్పంచ్ మృతితో లింగధన గ్రామం విషాదంలో మునిగింది. అయితే మయూరి మృతికి వ్యాక్సిన్ కారణమా? లేక ఇంకా ఏమైనా ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో వైద్యులు ఆరా తీస్తున్నారు.
Advertisement
Next Story