- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నెల్లూరు కుర్రాడి ఫైట్.. సరిలేరెవ్వరు
దిశ, వెబ్ డెస్క్ : అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా.. ఈ సంక్రాంతికి వచ్చిన సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో పాటు సినిమాలోని ఫైట్స్, డ్యాన్స్ ప్రత్యేకంగా నిలిచాయి. అందులోనూ.. కర్నూలులోని కొండారెడ్డి బురుజు దగ్గరి ఫైట్ అయితే.. సూపర్ స్టార్ అభిమానులతో ఈలలు పెట్టించి, సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఈ ఫైట్ కోసం చిత్ర నిర్మాతలు సైతం భారీగానే ఖర్చు పెట్టారు. అలాంటి ఫైట్‌ను పద్దినిమేదేళ్లయినా నిండని కొందరు కుర్రాళ్లు.. స్మార్ట్ ఫోన్‌తో ఎంతో అద్భుతంగా షూట్ చేసి.. దర్శకుడు అనిల్ రావిపూడితో పాటు.. అనేకమంది చిత్ర ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నారు. నెటిజన్లు కూడా ఆ కుర్రాళ్ల టాలెంట్‌కు ఫిదా అయిపోతున్నారు.
మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా.. నెల్లూరుకు చెందిన మీనంగారి కిరణ్ అనే పద్దెనిమిదేళ్ల కుర్రాడు.. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలోని ఇంటర్వెల్ ఫైట్ సీన్‌ను తమ ఊరిలోని కొంతమంది చిన్నారులతో రీక్రియేట్ చేశాడు. ఇందుకోసం ఎలాంటి కెమెరాలు, ఎఫెక్ట్స్ ఉపయోగించలేదు. కేవలం సెల్‌ఫోన్‌తోనే షూట్ చేశాడు. డైలాగ్‌లతో సహా అతడు తీసిన ఫైట్ సీన్ చూస్తే.. నిజంగానే వావ్ అనాల్సిందే. ఆ వీడియోను అనిల్ రీట్వీట్ చేయడంతో.. ఆ ఫైట్ కాస్త సోషల్ మీడియలో తెగ వైరల్ అయ్యింది. దాంతో కిరణ్ టాలెంట్ అందరికీ తెలిసింది. కిరణ్‌కు ఫైట్స్ తీయడం ఇదేం కొత్త కాదు. ఇంతకుముందే.. ‘సర్కార్’, ‘కాటమరాయుడు’ సినిమాల్లోని యాక్షన్ సీన్స్ కూడా రీక్రియేట్ చేశాడు.
చిన్నప్పటి నుంచే :
కిరణ్ తొమ్మిదో తరగతి వరకు మాత్రమే చదివాడు. తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో అమ్మకు సాయపడుతూ ఉండేవాడు. నటన, డైరెక్షన్‌పై ఇష్టం ఉండటంతో.. సినిమాల్లోకి వెళ్లాలనుకున్నాడు. దాంతో కిరణ్ తల్లి.. అతడిని హైదరాబాద్‌లోని ఓ యాక్టింగ్ స్కూల్‌లో చేర్పించింది. ఆర్థిక సమస్యల కారణంగా కిరణ్ మధ్యలోనే మానేసి, ప్రస్తుతం లేబర్‌గా పనిచేస్తున్నాడు. ఇక కిరణ్ కంపోజ్ చేసిన యాక్షన్ సీన్స్‌కు గంటల వ్యవధిలోనే లక్షల వ్యూస్ వచ్చాయి. కొండారెడ్డి బురుజు ఫైట్‌ను ఒక్కటిన్నర రోజులో, రమణ ఫైట్‌ను ఒక్క రోజులో కంప్లీట్ చేశానన్నాడు. తాను తీసిన వీడియో వైరల్ కావడం, డైరెక్టర్ అనిల్ రావిపూడి వాటిని రీట్వీట్ చేయడం చాలా సంతోషంగా ఉందన్నాడు.