- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అఖంఢ భారత్ కావాలనుకునే వాళ్లు ఆ ముస్లిం లను ఏం చేస్తారో చెప్పండి ?
ముంబాయి: అప్ఘాన్ పరిస్థితులు, భారత విభజన నాటి పరిస్థితులు ఒకేలా ఉన్నాయని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పోల్చి చూపే ప్రయత్నం చేశారు. ఆదివారం సామ్నాలో ఈ మేరకు రోక్థక్ పేరుతో ప్రత్యేక కాలం రాసిన ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. నాథురాం గాడ్సే జిన్నాను చంపినట్లయితే పాకిస్తాన్ అనేది ఉనికిలోకి రాకుండా ఉండేదని అభిప్రాయపడ్డారు. అప్పుడికా ఆగష్టు 14ను విభజన గాయాల దినంగా జరుపుకోవాల్సిన అవసరం ఉండేది కాదని పరోక్షంగా ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ అన్నారు.
ఓ దేశ అస్తిత్వం, సార్వభౌమాధికారాల విధ్వంసం తాలూకు బాధ ఎలా ఉంటుందో నేటి ఆఫ్ఘనిస్థాన్ పరిస్థితులు గుర్తు చేస్తున్నాయన్నారు. ఆఫ్ఘనిస్థాన్ సైన్యం తోక ముడిచిందన్నారు. విభజన గాయం ఎలా మానుతుందని ప్రశ్నిస్తూ, విడిపోయిన ముక్కను మళ్ళీ కలుపుకోకపోతే విభజన బాధ నుంచి ఉపశమనం ఎలా దొరుకుతుందని ప్రశ్నించారు. మనదేశం సార్వభౌమత్వం కోసం ఎలాంటి బాధలు పడిందో, ప్రస్తుతం అఫ్ఘాన్ పరిస్థితి అలాగే ఉందని అన్నారు. అమెరికా దళాలు వెనక్కి మరలటంతో ప్రతిఒక్కరూ భయంతో జీవిస్తున్నారని చెప్పారు. మేము ఒకప్పుడు అఖండ భారతం కావాలని కలలు కన్నాము. కానీ ప్రస్తుతం అది సాధ్యం కాదు, కానీ ప్రధాని మోడీ మాత్రం ఇంకా అదే ఆలోచనతో ఉన్నారని విమర్శించారు. అలా చేయాలనుకుంటే పాకిస్తాన్‌లో ఉన్న 11 కోట్ల ముస్లింలను ఏం చేయాలనుకుంటున్నారో ముందు చెప్పాలని డిమాండ్ చేశారు.
అఖండ హిందూస్తాన్‌కు చెందిన న్యాయవాదులు ముస్లింలీగ్ ఇచ్చిన ద్విజాతి సిద్దాంతాన్ని ఆమోదించారని అన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం దేశంలో ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ప్రవేశపెట్టినప్పుడు మహత్మగాంధీ దేశంలో ఇంక అడుగుపెట్టలేదని తెలిపారు. ఈ విధానాన్ని తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తరువాత రద్దు చేశారని వెల్లడించారు. గాంధీ మందు ముస్లింలీగ్ నాయకులు అలవికానీ కోరికల చిట్టా విప్పడంతో వాటిని ఆయన తిరస్కరించారని, దాంతో ముస్లింలీగ్ స్వతంత్రంగా ముందుకు వెళ్లిందని అన్నారు.