- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పనిమనుషులను కూడా వదలరా?.. హీరోయిన్ బీర్ బ్రాండ్ ప్రమోషన్‌పై ఫైర్
దిశ, సినిమా: సోషల్ మీడియా హ్యాండిల్ ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే(HOB)’.. డిఫరెంట్ పీపుల్ స్ట్రగుల్స్ అండ్ సక్సెస్ స్టోరీస్‌ను పోస్ట్ చేస్తూ పాపులారిటీ సంపాదించింది. కానీ హీరోయిన్ సంజనా సంఘీకి సంబంధించిన ఓ పోస్ట్‌పై భారీ ట్రోల్స్ ఎదుర్కొంటోంది. ఇంట్లో పనిమనుషులు పాండమిక్‌లో తనకు సహాయం చేసిన విధానంతో పాటు తను వారికి మళ్లీ ఫేవర్ చేయడం, వ్యాక్సిన్ ఇప్పించడం గురించి ఓ బీర్ బ్రాండ్ ప్రమోషన్స్‌లో(పెయిడ్ పార్టనర్‌షిప్)భాగంగా తెలిపిన సంజన.. ఆ వీడియోను సోషల్ మీడియాలోనూ షేర్ చేసింది.
కాగా ఇదే పోస్ట్‌ను HOB రీపోస్ట్ చేసిన కొద్దిగంటలకే ఇన్‌స్టాగ్రామ్‌లో విమర్శలు మొదలయ్యాయి. పనిమనుషులను తమ ప్రమోషన్స్ కోసం వాడుకుంటున్న చీప్ కల్చర్‌పై HOBతో పాటు హీరోయిన్ సంజన పైనా నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఇతరులకు సాయపడటం మంచి హృదయం కలిగిఉన్నవారు చేసే పనే అయినా తమ దగ్గర పనిచేసేవారికి వ్యాక్సిన్ ఇప్పించడాన్ని ఇంత గొప్పగా చెప్పుకోవడం అవవసరమా? అని ప్రశ్నిస్తున్నారు. తను మాత్రమే కాదు చాలా మంది తమ దగ్గర వర్క్ చేసే వారికి వ్యాక్సిన్ ఇప్పించారు. అది వారి బాధ్యత కూడా అని దెప్పిపొడుస్తూ పోస్ట్‌ను వెంటనే డిలీట్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో HOBతో పాటు సంజన కూడా ఈ పోస్ట్‌ను డిలీట్ చేసింది.