- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ క్రీడాకారిణి మళ్లీ రికార్డు సృష్టించింది
దిశ, స్పోర్ట్స్: భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మక ‘ఫెడ్ కప్ హార్ట్’ అవార్డును గెలుచుకున్న తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. ‘ఫెడ్ కప్’ అవార్డు విజేతలను ఎంపిక చేయడానికి మే 1 నుంచి ఆన్‌లైన్‌లో ఓటింగ్ నిర్వహించారు. ఆసియా-ఓషియానా విభాగంలో మొత్తం 16,985 ఓట్లు పోలవగా, సానియాకు 10 వేలకు పైగా ఓట్లు రావడం విశేషం. ఇండోనేషియాకు చెందిన ప్రిస్కా మెడ్లిన్ నుగ్రోను అధిగమించి సానియా ఈ అవార్డుకు ఎంపికైంది. ‘నాకు ఓటేసిన ప్రతీ అభిమానికి, నా దేశానికి ఈ అవార్డును అంకితమిస్తున్నాను. ఫెడ్‌కప్ గెలిచిన తొలి భారతీయురాలిగా నిలవడం చాలా గర్వంగా ఉంది. భవిష్యత్‌లో దేశానికి మరింత కీర్తి ప్రతిష్టలు తీసుకొని వస్తాను’ అని సానియా ఒక ప్రకటనలో పేర్కొంది. మరోవైపు ఈ అవార్డు ద్వారా సానియా మీర్జాకు అందిన రూ.1.51 లక్షల రూపాయలను కరోనా వైరస్ సహాయ చర్యల కోసం తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందిస్తున్నట్లు ప్రకటించింది..