- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తల్లులకు లేఖ రాసిన సానియా
దిశ, స్పోర్ట్స్ : మహిళలు క్రీడల్లో రాణించడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. పురుషుల్లాగా స్వేచ్ఛ ఉండదు. పైగా మహిళలకు మాత్రమే ఉండే కొన్ని ఇబ్బందులు వారిని కెరీర్‌లో ఏదో ఒక సమయంలో వెనక్కు నెడుతూ ఉంటాయి. ముఖ్యంగా నెలసరి, పెళ్లి, గర్భం, పిల్లలు అనేది మహిళా క్రీడాకారిణులకు సాధారణంగానే ఎదురయ్యే ఇబ్బందులు. మహిళా క్రీడాకారుణిల జీవితంలో ఎదురయ్యే పరిస్థితులపై ఇటీవల టెన్నిస్ దిగ్గజం సెరేనా విలియమ్స్ జీవితం ఆధారంగా డిస్కవరీ చానల్‌లో ఒక డాక్యుమెంటరీ ప్రసారం అయ్యింది.
మహిళగా, భార్యగా, తల్లిగా తాను ఎదుర్కున్న పరిస్థితులను ఈ డాక్యుమెంటరీలో వివరించారు. దీన్ని చూసిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చలించిపోయారు. తన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురు కావడంతో ఆమె తల్లులకు సోషల్ మీడియా సాక్షిగా ఒక లేఖ రాశారు. ‘డెలివరీ తర్వాత మహిళలకు శారీరికంగా చాలా మార్పులు వస్తాయి. ఇవి అథ్లెట్స్‌ను చాలా ఇబ్బంది పెడతాయి. కానీ అలాంటి ఇబ్బందులను కూడా అధిగమించి తిరిగి ఆటలో ప్రవేశించడం చాలా కష్టమం. నేను ప్రెగ్నెన్సీ తర్వాత 23 కేజీలు పెరిగాను. ఆ బరువు తగ్గించుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. కానీ నా కుటుంబం, భర్త సహకారంతో అన్నింటినీ అధిగమించి బరువు తగ్గించుకొని తిరిగి ఆటలోకి అడుగుపెట్టాను. మానసికంగా కూడా ధృఢంగా మారాను.’ అని లేఖలో పేర్కొన్నారు.