- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
2023 వరకు నేను ఏం మాట్లాడను.. ఆ తర్వాతే నోరు విప్పుతా : జగ్గారెడ్డి
దిశ, డైనమిక్ బ్యూరో : హుజురాబాద్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ఘోర పరాజయం పొందడానికి గల కారణాలపై గాంధీభవన్‌లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ బుధవారం సమావేశమైంది. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి, భట్టి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నాల, బోస్‌రాజు, శ్రీధర్ తదితరులు సమావేశానికి హాజరయ్యారు. అయితే, ఈ భేటికీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి హాజరుకాలేదు. ఈ క్రమంలోనే సమావేశం జరుగుతుండగా.. జగ్గారెడ్డి గాంధీభవన్‌కు చేరుకుని మీడియాతో మాట్లాడారు. పెద్ద పెద్ద స్టార్స్ వెళ్తేనే ఓట్లు రాలేదు.. నేను వెళ్తే ఓటు వేస్తారా అని ప్రశ్నించారు.
నేను మాట్లాడిన వాటికి కాంగ్రెస్ నాపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలియదన్నారు. ‘‘పార్టీకి సంబంధించిన విషయాలు మీడియా ముందు కానీ, గాంధీ భవన్‌లో కానీ మాట్లాడను. ఇగ నేను ఏం మాట్లాడినా సమస్య వస్తోంది. ఎవరి కొంప మునిగినా నాదీ పోయేది ఏం లేదు. నా సీటు ఎలా గెలుచుకోవాలో అన్న దానిపై దృష్టి పెడుతా.. ఇక 2023 వరకూ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏ విషయాల గురించి మాట్లాడను. ఉన్నదున్నట్లు మాట్లాడి నేను బ్యాడ్ అవుతున్నా.. కొన్ని విషయాలను పార్టీని అడుగుతా.. ఇదే చివరిది. నేను చెప్పాలనుకున్నది ఇప్పుడే చెప్పేస్తా.’’ అని ఆసక్తికర వాఖ్యలు చేశారు.