సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

by Shyam |
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
X

దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా కూరగాయల మార్కెట్లలో ప్రజలు గుంపులు గుంపులుగా తిరగరాదని కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. బుధవారం సంగారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్ గంజి మైదాన్, తార డిగ్రీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మార్కెట్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సామాజిక దూరం పాటిస్తున్న కొనుగోలుదారులను అభినందిస్తూనే.. మరోవైపు గుంపులుగా ఉన్నవారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయా సెంటర్లలో పిల్లలకు వేస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. చిన్న పిల్లలకు నిర్ణీత సమయంలో ఇవ్వాల్సిన వ్యాక్సినేషన్ విధిగా వేయించాలని చెప్పారు. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో బుధవారం, శనివారం వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు.

Tags: Collector Hanumantharao, Sudden Inspections, Sangareddy

Advertisement

Next Story

Most Viewed