సామాజిక దూరం పాటించాలి: కలెక్టర్

by Shyam |

దిశ, మెదక్: కిరాణా షాపులు, కూరగాయల మార్కెట్లలో గుంపులు గుంపులుగా ఉండరాదని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు . సోమవారం సంగారెడ్డి పట్టణంలోని పాతబస్టాండ్ ( గంజిమైదాన్) కూరగాయల మార్కెట్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ కూరగాయల కొనుగోలుకు వచ్చిన వారు గుంపులుగా ఉండటం చూసిన ఆయన అసహనం వ్యక్తం చేశారు. వ్యాపారులతో కలెక్టర్ మాట్లాడుతూ కూరగాయల దుకాణాలు దూరం దూరంగా పెట్టుకోవాలని, మాస్క్‌లు ధరించి, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు.

Tag: collector hanumantha rao, comments, Social distance, sangareddy

Next Story