- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భారత్‌లో ఉత్పత్తికి సిద్ధమైన శాంసంగ్
దిశ, వెబ్‌డెస్క్: దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్, మొబైల్‌ఫోన్ దిగ్గజ కంపెనీ శాంసంగ్ (Samsung) భారత్‌లో భారీగా పెట్టుబడులను పెట్టాలని భావిస్తోంది. ప్రధానంగా చైనా ఉత్పత్తుల (China products)నిషేధ అంశం విపరీతమైన చర్చకు దారి తీస్తుండటంతో, చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ (Smartphone) ఉత్పత్తి కంపెనీలతో పోటీ పడేందుకు సరికొత్త వ్యూహానికి శాంసంగ్ (Samsung) సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
ఇతర దేశాల్లో ఉన్న తమ కంపెనీ పెట్టుబడులను భారత్‌కు తరలించాలని భావిస్తోంది. ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక (PLI) పథక కింద స్మార్ట్‌ఫోన్ల (Smartphones)ఉత్పత్తిని మరింత విస్తృతం చేయనుంది. దీనికి సంబంధించిన అంశాలను ప్రభుత్వం వద్ద నివేదించినట్టు తెలుస్తోంది. దేశంలో సుమారు రూ. 3 లక్షల కోట్ల విలువైన పరికరాలను ఉత్పత్తి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు, ముఖ్యంగా రాబోయే 5 ఏళ్ల కాలంలో రూ. 15 వేల కంటే తక్కువ ధరలో ఉన్న ఫోన్‌ల ఉత్పత్తులను తీసుకురానుంది.
ఈ ధరలో వచ్చే ఫోన్‌ల విలువ సుమారు రూ. 1.7 లక్షల కోట్ల వరకు ఉండనున్నట్టు, వీటిలో చాలా వాటిని ఎగుమతి చేస్తుంది. ఇటీవల కేంద్ర ఐటీ మంత్రి (Union IT Minister) రవిశంకర్ ప్రసాద్.. పీఎల్ఐ ( (PLI) పథకానికీ దేశీయంగానే కాకుండా, అంతర్జాతీయంగా ఎలక్ట్రానికి పరికరాల తయారీ కంపెనీల నుంచి ఆదరణ బాగుందని తెలిపారు. ముఖ్యంగా యాపిల్, శాంసంగ్ (Apple, Samsung) లాంటి అంతర్జాతీయ కంపెనీలతో పాటు దేశీయ కంపెనీలైన మైక్రోమ్యాక్స్, లావాలు కూడా ముందుకొచ్చాయన్నారు.
అంతర్జాతీయంగా స్మార్ట్‌ఫోన్ల (international Smartphones) మార్కెట్ విలువ 270 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు అంచనాలున్నాయి. ఇందులో యాపిల్ సంస్థ (Apple company)38 శాతం, శాంసంగ్ (Samsung) 22 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి. అయితే, శాంసంగ్ తన ఉత్పత్తిలో సుమారు 50 శాతం వియత్నాంలోనే కలిగి ఉంది. దక్షిణ కొరియా (South Korea)లో కార్మిక ఖర్చు అధికంగా ఉన్నందున అక్కడ తయారీని నిలిపేయాలని భావిస్తోంది. కాగా, శాంసంగ్ (Samsung)కు వియత్నాం సహా ఇండోనేషియా, బ్రెజిల్ (Indonesia, Brazil)దేశాల్లో ఉత్పత్తి యూనిట్లు ఉన్నాయి.