స్టెప్పులేసిన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌బాబు

by Shyam |
స్టెప్పులేసిన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌బాబు
X

దిశ, వెబ్‌డెస్క్: బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా న‌టిస్తోన్న చిత్రం ‘బ‌జారు‌ రౌడీ’. ఈ చిత్ర క్లైమాక్స్‌ని ఇటీవలే భారీ తారాగణంతో షూట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు సారథి స్టూడియోలో మొదలయ్యాయి. అన్ని కమర్షియల్ హంగులతో ద‌ర్శ‌కుడు వసంత నాగేశ్వ‌రావు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో అప్‌డేట్‌ను చిత్రయూనిట్‌ రివీల్ చేసింది.

ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ నిక్స‌న్ మాస్ట‌ర్ సార‌థ్యంలో గుంటూరు జిల్లా కొండ‌వీడు గ్రామ అందాల మ‌ధ్యలో హీరో సంపూర్ణేష్ బాబు, హీరోయిన్ మ‌హేశ్వ‌రి వ‌ద్ది‌పై ఓ సాంగ్‌ను చిత్రీకరించినట్లుగా చిత్రయూనిట్‌ ప్రకటించింది. ఈ సాంగ్‌ చాలా బాగా వచ్చిందని, సంపూ‌తో కొరియోగ్రాఫర్ క్రేజీ స్టెప్పులు వేయించారని, థియేటర్లలో ప్రేక్షకులు సాంగ్‌ను ఎంజాయ్‌ చేస్తారని నిర్మాత తెలిపారు. ఈ చిత్రాన్ని కె.ఎస్.క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌‌పై నిర్మాత సందిరెడ్డి శ్రీనివాస‌రావు నిర్మిస్తున్నారు. త్వరలోనే ఫస్ట్ లుక్‌ విడుదల చేస్తామని, చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సాయికార్తీక్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకు ఎడిటర్ గౌతంరాజు, సినిమాటోగ్రఫీ విజయ్ కుమార్.

Advertisement

Next Story

Most Viewed