కోర్టును ఆశ్రయించిన సమంత.. నేడు దానిపై క్లారిటీ రానుందా ?

by Shyam |
కోర్టును ఆశ్రయించిన సమంత.. నేడు దానిపై క్లారిటీ రానుందా ?
X

దిశ, తెలంగాణ బ్యూరో : కొన్ని యూ ట్యూబ్ చానళ్లు ప్రసారం చేసిన వార్తలపై సినీ నటి సమంత కోర్టును ఆశ్రయించారు. నిరాధారమైన వార్తలను ప్రసారం చేసి తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్న రెండు యూట్యూబ్ చానళ్లపై.. అందులో అభిప్రాయాలను వ్యక్తం చేసిన వ్యక్తిపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూకట్‌పల్లి సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని అడ్మిట్ చేసుకునే విషయమై గురువారం న్యాయస్థానం క్లారిటీ ఇవ్వనున్నది. వాస్తవాలతో సంబంధం లేకుండా తన వైవాహిక బంధంపై ప్రసారం చేసిన వ్యాఖ్యానాలపై ఆ రెండు చానళ్లు, విశ్లేషణ పేరుతో కామెంట్లు చేసిన వ్యక్తి భేషరతుగా, బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, దీన్ని పత్రికల్లో ప్రచురించాలని ఆ సూట్‌లో సమంత తరఫు న్యాయవాది విజ్ఞప్తిచేశారు. ఇప్పటివరకు ప్రసారం చేసిన వ్యాఖ్యలతో తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగిందని, ఇకపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఇంజంక్షన్ ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. కోర్టు విచారణ జరిపిన తర్వాత దీనిపై స్పష్టత రానున్నది.

Advertisement

Next Story

Most Viewed