విడాకుల తరువాత సమంత కొత్త షరతులు.. ఇకపై అక్కడ కనిపించనంటూ..?

by Anukaran |   ( Updated:2021-10-17 22:38:27.0  )
విడాకుల తరువాత సమంత కొత్త షరతులు.. ఇకపై అక్కడ కనిపించనంటూ..?
X

దిశ, వెబ్‌డెస్క్: సౌత్ స్టార్ హీరోయిన సమంత- నాగ చైతన్యతో విడాకుల తరువాత టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన విషయం తెలిసిందే. ఈ విడాకుల తరువాత కొద్దీ రోజులు గ్యాప్ తీసుకున్న అమ్మడు ప్రస్తుతం వరుస సినిమాలను అంగీకరిస్తూ బిజీగా మారుతోంది. ఇప్పటికే ‘శాకుంతలం’ను పూర్తిచేసిన సామ్ తమిళ అగ్ర బ్యానర్ డ్రీమ్ వారియర్స్ తో పాటు శ్రీదేవి మూవీస్ బ్యానర్ లో కూడా ఒక సినిమా చేయనుంది. రెండూ ద్విభాషా చిత్రాలు కావడం గమనార్హం. త్వరలోనే ఈ షూటింగ్స్ మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలోనే సామ్, నిర్మాతలకు కొన్ని షరతులు పెట్టినట్లు సమాచారం.

విడాకుల తరువాత సామ్ బయట ఎక్కడ కనిపించలేదు. కనీసం బయటికి రావాలని కూడా లేదని సామ్ తెలిపినట్లు సమాచారం. ఈ కారణంగానే తన సినిమా షూటింగుల కోసం మెజారిటీ పార్ట్ చెన్నై లేదా ఆ చుట్టుపక్కల లొకేషన్లను ఎంచుకోవాలని సమంత దర్శకనిర్మాతలను కోరుతున్నారట. అంతేకాకుండా హైదరాబాద్ లోనే షూటింగ్ చేయాలంటే కేవలం ఇండోర్ లో మాత్రమే చేస్తానని, పబ్లిక్ ఎక్కువగా తిరిగే ప్రదేశాల్లో చేయనని తెలిపిందట. ప్రస్తుతం సామ్ కండీషన్స్ దర్శకనిర్మాతలకు షాక్ కి గురిచేస్తున్నాయి. అయినా ఆమె ఉన్న పరిస్థితిని అర్ధం చేసుకొని వారు కూడా సామ్ కండీషన్స్ ని ఒప్పుకున్నట్లు సమాచారం. ఇకపోతే సామ్ షరతులు అభిమానులను భయానికి గురిచేస్తున్నాయి. ముందు ముందు సమంత హైదరాబాద్ కి, టాలీవుడ్ కి దూరం కాబోతుందా..? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed