సమంత- చైతన్యను కలపడానికి వారి విశ్వప్రయత్నం.. విడాకులు ఆగనున్నాయా..?

by Anukaran |   ( Updated:2021-09-20 00:30:13.0  )
సమంత- చైతన్యను కలపడానికి వారి విశ్వప్రయత్నం.. విడాకులు ఆగనున్నాయా..?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియా లో ట్రెండింగ్ లో ఉన్న వార్త ఏది అంటే అక్కినేని నాగ చైతన్య- సమంత ల విడాకుల టాపిక్.. ఈ విషయమై ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా అభిమానులలో మాత్రం అడోరబుల్ కపుల్ నోటివెంటనే మేము విడిపోలేదు అనే మాటను వినాలనుకొంటున్నారు. ఎంతో ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట మధ్య విభేధాలకు కారణం ఏంటి..? అనేది అభిమానులను తొలిచేస్తున్న ప్రశ్న. ఇకపోతే సోషల్ మీడియా వేదికగా తాను సినిమాలకు బ్రేక్ తీసుకొంటున్నాను అని చెప్పి వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న సామ్ ఇటీవల ఈ వార్తలపై ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ఇక మరోపక్క చై సైతం తన సినిమా ప్రమోషన్స్ లో సామ్ గురించి మాట్లాడకూడదని కండిషన్ కూడా పెట్టాడు. ఇక వీరిద్దరూ ఇలా ఉంటే కుటుంబ పెద్ద నాగార్జున అయితే అసలు మీడియా కంటికి చిక్కడం లేదు. ఇప్పటివరకు ఆయన ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడడంలేదు అనేది అభిమానులను వేధిస్తున్న ప్రశ్న. ఇవన్నీ వారి విడాకులు కన్ఫర్మ్ అని తెలిపేలా చేస్తున్నాయి.

ఇకపోతే ఈ రూమర్స్ కి ఈ అక్కినేని జంట ఎలాగైనా చెక్ పెట్టకపోతే ఇంకా ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే హాట్ టాపిక్ గా మారిన ఈ పుకార్లు కొన్ని రోజులు వీరు మౌనంగా అంటే సెన్సేషనల్ గా మారిపోయినా ఆశ్చర్యం లేదు. దీంతో ఆలోచించిన ఈ జంట ఈ రూమర్స్ కి చెక్ పెట్టే ఆలోచనలో ఉన్నారట. త్వరలో ఇద్దరు కలిసి పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఓ వెబ్ సిరీస్ లో నటించబోతున్నారట. ఈ క్రేజీ వెబ్ సిరీస్ ని ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ నిర్మించబోతున్నదట. దీనికోసం నెట్ ఫ్లిక్స్ విశ్వ ప్రయత్నాలు చేసిందని టాక్. అక్టోబర్ లో వారి వివాహ వార్షికోత్సవం రోజున ఈ విషయాన్ని బయటపెట్టి.. అన్ని పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టే పనిలో వారితో పాటు నెట్ ఫ్లిక్స్ సంస్థ కూడా ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో అనేది తెలియాలి. మరి ఈ విషయమై నాగార్జున ఏ విధంగా స్పందిస్తారు..? అనేది తెలియాల్సి ఉంది.

ఇకపోతే సామ్ ఇటీవల గుడిలో మీడియా పై ఫైర్ అవడం సమంజసమైన పని కాదని కొంతమంది వాదిస్తున్నారు. గుడిలో అయినా, బయట అయినా రిపోర్టర్ అడిగింది తన భర్త గురించే కదా..? తప్పుగా ప్రశ్న అడగలేదు కదా.. దానికి పోయి సామ్ సీరియస్ అయ్యి గుడికి వచ్చి బుద్ది వుందా..? అని చీవాట్లు పెట్టడంతో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. అంటే చై గురించి మాట్లాడడానికి కూడా అంత ఇష్టం లేదా..? అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story