సామ్.. సండే అప్రిషియేషన్!

by Shyam |   ( Updated:2023-03-15 02:23:35.0  )
సామ్.. సండే అప్రిషియేషన్!
X

దిశ, వెబ్‌డెస్క్: సమంత అక్కినేని తోటి హీరోయిన్లకు స్ఫూర్తి. ఫిట్‌నెస్‌పై కాన్సంట్రేషన్, మూవీస్ సెలెక్షన్, యాక్టింగ్ స్కిల్స్, గార్డెనింగ్.. ఇలా ప్రతీ విషయంలోనూ తను బెస్ట్ అని చెప్తుంటారు. ఇక ఈ మధ్య అన్నీ గార్డెనింగ్ పోస్ట్‌లు పెట్టిన సామ్.. సండే అప్రిషియేషన్ పోస్ట్‌తో సమాజం పట్ల మనం ఎంత బాధ్యతగా ఉండాలో చెప్పింది.

మామూలుగా అయితే, రోడ్డు మీద గాయాలతో ఉన్న కుక్కలను చూసి చాలా మంది అలాగే వెళ్ళిపోతారు. కానీ తన ఫ్రెండ్ మాత్రం ఆ మూగ జీవి బాధ చూడలేక ఇంటికి తీసుకొచ్చిందని తెలిపింది. నడుము విరిగిపోయి, అసలు నడవలేని పరిస్థితిలో గాయాలతో ఉన్న ఓ కుక్క పిల్లను 2 వారాల్లో 10 సార్లు థెరపీ సెషన్స్‌కు తీసుకెళ్లిందని చెప్పింది. దానికి స్నానం చేయించి, ఓదార్చి, కోలుకునేందుకు సహాయం అందించిందని తెలిపింది.

ఒకరిని కిందకు లాగే బదులు, పైకి ఎత్తడానికి ప్రయత్నిద్దామని.. దానిపైనే దృష్టి పెట్టాలని కోరింది. ఇలాంటి మంచి పనులు మన చుట్టూ చాలా జరుగుతూ ఉంటాయి. వాటిని అప్రిషియేట్ చేద్దామని సూచించింది.

Advertisement

Next Story

Most Viewed