- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Samantha Akkineni: రణ్‌బీర్‌తో రొమాన్స్‌కు ‘నో’ ప్రాబ్లమ్ : సమంత
దిశ, సినిమా : తెలుగు, తమిళ్ సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా రాణించిన సమంత అక్కినేని, పెళ్లి తర్వాత కూడా సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. అయితే తన జనరేషన్‌కు చెందిన హీరోయిన్లు బాలీవుడ్‌లోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా.. సామ్ మాత్రం అటువైపు ఫోకస్ చేయకపోవడం గమనార్హం. ఈ మధ్యే ‘ఫ్యామీలీ మ్యాన్ 2’ సిరీస్ ద్వారా హిందీలో డిజిటల్ ఎంట్రీకి సిద్ధమైన సామ్.. ఇందులో యాంటగోనిస్ట్‌గా కనిపించబోతోంది.
ప్రమోషన్స్‌లో భాగంగా తాజా ఇంటర్వ్యూలో ఇంతకాలంగా హిందీ ప్రాజెక్ట్‌లో ఎందుకు నటించలేదనే ప్రశ్నకు.. ‘ఇక్కడి టాలెంట్స్ చూసి నేను భయపడుతున్నానేమో!’ అంటూ నవ్వుతూ ఆన్సర్ ఇచ్చింది సామ్. ఇక ఏదైనా బాలీవుడ్ రొమాంటిక్ ఫిల్మ్‌లో అవకాశమొస్తే.. ఎవరికి జంటగా నటించాలని అనుకుంటున్నారు? అని అడిగితే రణ్‌బీర్ కపూర్ పేరు చెప్పింది. కాగా రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ జూన్ 4న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. మనోజ్ బాజ్‌పాయ్ లీడ్ రోల్ పోషించిన సిరీస్‌లో ప్రియమణి, షరీబ్ హస్మి, సీమ బిశ్వాస్, దర్శన్ కుమార్ తదితరులు నటించారు.