చెర్రీకి సల్లూ భాయ్ సపోర్ట్ చేస్తాడా?

by Jakkula Samataha |
చెర్రీకి సల్లూ భాయ్ సపోర్ట్ చేస్తాడా?
X

దిశ, సినిమా : డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌పై ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వినిపిస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ నటించే చాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ కథలోని డ్రామా అండ్ స్క్రీన్‌ప్లే.. స్ట్రాంగ్ పర్సనాలిటీని డిమాండ్ చేస్తుండగా, చెర్రీ 15వ సినిమాలో సల్లూ భాయ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ క్యారెక్టర్ మూవీకి కీలకం కాగా, ఒకవేళ సల్లూ భాయ్ ఈ పాత్ర చేస్తే.. 25-30 రోజుల పాటు డేట్స్ కేటాయించాల్సి వస్తుంది. అయితే తన ప్రజెన్స్‌తో క్యారెక్టర్ ఎలివేట్ అవుతుందని భావిస్తున్న మేకర్స్.. డైరెక్టర్, చెర్రీ త్వరలో సల్లూ భాయ్‌ను అప్రోచ్ అవుతారని, ఆల్మోస్ట్ ఓకే అవుతుందనే అనుకుంటున్నారు. ఒకవేళ హీరో గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే మరో సీనియర్ యాక్టర్‌ను సంప్రదిస్తారని తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed