‘రాధే’ సెట్‌లో సల్లూ భాయ్..

by Shyam |
‘రాధే’ సెట్‌లో సల్లూ భాయ్..
X

దిశ, వెబ్‌డెస్క్ :
ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్‌ ‘రాధే’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘రాధే’ తప్పక ఉంటుంది. అట్లూరి అగ్నిహోత్రి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇంకొన్ని రోజుల్లో పూర్తవుతుందనే దశలో కరోనా ప్రభావంతో బ్రేక్ పడింది. కాగా, ఆరున్నర నెలల తర్వాత సల్మాన్ ‘రాధే’ సెట్‌లో అడుగుపెట్టాడు. దానికి సంబంధించిన ఫొటోను సల్మాన్ ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. షూటింగ్‌లో పాల్గొనే నటీనటులు, సిబ్బందికి ముందుగానే కొవిడ్‌ – 19 పరీక్షలు నిర్వహించారు. ముంబై సమీపంలోని ‘కర్జత్‌’లో తాజా షెడ్యూల్‌ ప్లాన్‌ చేసింది చిత్ర యూనిట్‌. అక్కడ 15 రోజుల పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించిన తర్వాత, మెహబూబా స్టూడియోలో జరిగే షెడ్యూల్‌తో ‘రాధే’ షూటింగ్‌ పూర్తవనుంది. ఈ చిత్రంలో దిశా పటానీ కథానాయికగా నటిస్తోంది. రణ్‌దీప్‌హూడా, జాకీష్రాఫ్‌ ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. ఇందులో ఓ పాత్ర కోసం మేఘా ఆకాశ్‌ను తీసుకున్నారు. ఇక సల్మాన్ బిగ్‌బాస్‌ సీజన్‌ 14‌ షూటింగ్‌లో కూడా ఇటీవలే పాల్గొన్నాడు.

Advertisement

Next Story