AP News: చంద్రబాబు కంచుకోటను బద్దలు కొడతాం: సజ్జల రామకృష్ణారెడ్డి

by srinivas |   ( Updated:2021-09-01 10:03:22.0  )
sajjala
X

దిశ, ఏపీ బ్యూరో: 2024 సాధారణ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఘన విజయం సాధించడం ఖాయమని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వైసీపీ దివంగత నేత చంద్రమౌళి తనయుడు భరత్ జెయింట్ కిల్లర్‌గా అసెంబ్లీలో అడుగుపెడతారని ఆశిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబుకు సర్పంచ్ ఎన్నికల నుంచే కుప్పంలో కౌంట్ డౌన్ ప్రారంభమైందన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వ‌న్యకుల క్షత్రియ‌ కమ్యూనిటీ రాష్ట్ర స్థాయి సమావేశంలో పాల్గొన్న సజ్జల కుప్పం టీడీపీ కోటను బధ్దలు కొట్టుకుని సీఎం జగన్ ఎంతగా ప్రజల హృదయాలలో చొచ్చుకుని పోయారనేందుకు సర్పంచ్ ఎన్నికలలో విజయమే తార్కాణంగా నిలుస్తుందన్నారు. సర్పంచ్ ఎన్నికల విజయాలను యువనేత భరత్ కొనసాగించాలని సజ్జల రామకృష్ణారెడ్డి ఆకాంక్షించారు.

Advertisement

Next Story

Most Viewed