- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాగ చైతన్యతో ముద్దు.. సాయిపల్లవి షాకింగ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: చిత్ర పరిశ్రమలో కొన్నికాలాలు ఉండాలంటే కొన్ని పాత్రలు చేయక తప్పదు. గ్లామరస్ పాత్రలు అయినా, ముద్దు సీన్లకైనా ఓకే చెప్పాలి. ఇక ఈ కాలంలో ముద్దు సీన్లు సాధారణమైపోయాయి. కానీ, కొంతమంది హీరోయిన్లు ఇలాంటివాటికి దూరం అని మడికట్టుకు కూర్చొన్నారు. వాటిమీదే నిలబడుతున్నారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన హీరోయిన్ సాయి పల్లవి. ఫిదా చిత్రంతో అందరి మనసులను ఫిదా చేసిన ఈ ముద్దుగుమ్మ గ్లామరస్ రోల్స్ కి కానీ, ముద్దు సీన్లకు కానీ ఓకే చెప్పను అని తెగేసి చెప్పింది. దానికే కట్టుబడి ఉంది. ఇక ఈ క్రమంలోనే నాగ చైతన్య కు ‘లవ్ స్టోరీ’ చిత్రంలో ముద్దు పెట్టేసి షాక్ ఇచ్చింది. ఒక సీన్ లో చైతూకు చటుక్కున ఒక ముద్దిచ్చేసి పరుగందుకుంటుంది. ఆ సీన్ కోసం థియేటర్లకు పరిగెత్తుకొచ్చిన కుర్రాళ్లు చాలామందే ఉన్నారు. ఇక దీంతో సాయి పల్లవి కూడా ముద్దు సీన్లకు రెడీ అంటూ కొందరు కామెంట్ చేస్తుండంతో ఒక ఇంటర్వ్యూలో వాటిపై క్లారిటీ ఇచ్చింది.
“నేను ఇంతవరకూ ఏ సినిమాలోనూ ముద్దు సీన్లు చేయలేదు .. ఇకపై చేయను కూడా. నేను ఒక సినిమాను అంగీకరించేటప్పుడే ‘ముద్దు సీన్లు చేయను’ అనే విషయాన్ని చెప్పేస్తాను. ఈ సినిమాలో నేను చైతూను నిజంగా ముద్దుపెట్టుకోలేదు. అలా అనిపించేలా కెమెరా యాంగిల్ ను సెట్ చేశారంతే. ఇదంతా కెమెరా పనితనం. నేను ముద్దు సీన్లు చేయననే విషయం శేఖర్ కమ్ములగారికి తెలుసు .. అందువలన ఆయన నన్ను ఇబ్బంది పెట్టలేదు” అని చెప్పుకొచ్చింది. దీంతో ఆమె అభిమానులందరూ ఆమెను ఆకాశానికెత్తుస్తున్నారు. అవకాశాల కోసం, గ్లామర్ పాత్రల కోసం నగ్నంగా నటించడానికి రెడీ అవుతున్న హీరోయిన్లు ఉన్న ఈ ఇండస్ట్రీలో ముద్దు సీన్లకు, గ్లామరస్ పాత్రలకు నో చెప్పడమంటే మాటలు కాదని పొగిడేస్తున్నారు.