- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మామపై తేజూ ట్వీట్ : సూపర్ అంటోన్న ఫ్యాన్స్
దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు అభిమానులు. పవన్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా అభిమానులు, జనసేన నాయకులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జనసేనాని దీనిపై స్పందిస్తూ… వారందరికీ కృతఙ్ఞతలు తెలిపారు. ఇక వేడుకల నిర్వహణలో కొన్నిచోట్ల అపశృతి జరిగి కొందరు అభిమానులు ప్రాణాలు కోల్పోవడంపై పవన్ కళ్యాణ్ తో పాటు మెగా ఫ్యామిలీ ఆవేదన వ్యక్తం చేసింది.
అభిమానులు చేసే సేవా కార్యక్రమాలు, వేడుకలు ఒక ఎత్తైతే… ఆయనకి ఏయే సెలెబ్రిటీస్ ఎలా విషెస్ చెప్పారు? అనేది ఫ్యాన్స్ కి స్పెషల్. సెలెబ్రిటీస్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను స్టేటస్ గా పెట్టుకుని సంతోషిస్తుంటారు అభిమానులు. ఇక అందులోనూ చిరు, చెర్రీ, బన్నీ, సాయిధరమ్ విషెస్ కి ఉన్న క్రేజ్ చెప్పలేము. ఈసారి మెగా ఫ్యామిలీ చేసిన సోషల్ మీడియా పోస్ట్స్ లో సాయిధరమ్ ట్విట్టర్ లో చేసిన ట్వీట్ హైలైట్ గా నిలిచింది.
“అప్పుడూ.. ఇప్పుడూ.. ఎప్పుడూ… #HBDPawanKalyan mama” అంటూ ఫోటో జత చేస్తూ తేజ్ చేసిన ట్వీట్ లో చాలా నిగూడార్థం కనిపిస్తోంది. అల్లుడిని సంరక్షిస్తూ మామ, మామని జవదాటని అల్లుడు అన్నట్టు ఉంది ఈ పిక్. నిజానికి ఫొటోలోనే కాదు… నిజ జీవితంలో కూడా ఈ మామా అల్లుళ్ళ అనుబంధం అలానే ఉంటుంది. చాలా ఇంటర్వూస్ లో నేను కళ్యాణ్ మామని ఫాలో అవుతా అంటాడు తేజ్… నీకు ఎలాంటి కష్టం వచ్చినా ఈ మామ ఉన్నాడు అని పవన్ కూడా హామీ ఇచ్చాడు.
అప్పుడూ.. ఇప్పుడూ.. ఎప్పుడూ… #HBDPawanKalyan mama ❤️❤️❤️ pic.twitter.com/xNqnkaVYXX
— Sai Dharam Tej (@IamSaiDharamTej) September 2, 2020
ఒక సినిమా ఫంక్షన్ లో పవన్, తేజ్ గురించి చెబుతూ… తేజ్ ఎంబీఏ చేస్తున్నప్పుడు నా దగ్గరికి వచ్చి ఫిలిమ్స్ లో యాక్ట్ చేయాలని ఉందని చెప్పాడు. సినిమాల్లోకి రావాలంటే విపరీతమైన ప్యాషన్, నిజాయితీ, కృషి, పట్టుదల ఉండాలి అని చెప్పాను. నాకు తెలిసిన యాక్టింగ్ నేర్పించే గురువుల దగ్గరికి పంపాను. అంతకుమించి నేను ఎవరి దగ్గర రికమెండ్ చేయలేదు. ఫ్యామిలీ పేరుతొ కాదు కృషితో అభిమానుల్ని చూరగొనాలి అని చెప్పాను అన్నారు.
మామ చెప్పినట్టే సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగి, ఆడిషనస్ అటెండ్ అయి అవకాశాలు తెచ్చుకున్నాడు తేజు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్, బన్నీ… తేజ్ సినిమా ఫంక్షన్స్ లో వెల్లడించారు. ఇక్కడే అర్ధం అవుతుంది మామ మాటలకి ఎంత గౌరవం ఇచ్చాడో సాయి ధరమ్ తేజ్. లేదంటే సినిమాల్లో తన ఎంట్రీ చాలా ఈజీ అయుండేది కదా..!
తప్పటడుగులు వేసేటప్పుడు, కెరీర్ లో అడుగులు వేస్తున్నప్పుడు మామ తనని ఎలా కేర్ తీసుకున్నాడో అనే అర్ధం వచ్చేలా సాయి ధరమ్ తేజ్ పెట్టిన పోస్ట్.. మెగా ఫ్యాన్స్ కే కాదు, నాన్ మెగా ఫ్యాన్స్ ని కూడా ఆకట్టుకుంటోంది. ఇక పవర్ స్టార్ అభిమానులైతే ఈ ట్వీట్ ను తెగ వైరల్ చేస్తున్నారు.