ఘరానా దొంగ అరెస్ట్..

by Sumithra |
ఘరానా దొంగ అరెస్ట్..
X

దిశ, హైదరాబాద్ : తాళాలు వేసిన ఇళ్లనే టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా దొంగ సద్దాం అలిని మంగళవారం అరెస్ట్ చేసినట్టు నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. సీపీ కథనం ప్రకారం..మౌలాలికి చెందిన సద్దాం అలి వెల్డింగ్ పనిచేస్తూ జీవనం గడిపేవాడు. సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలకు అలవాటు పడ్డాడు. అతనిపై ఇప్పటి వరకు వివిధ పీఎస్‌లలో 51 కేసులు ఉన్నాయని సీపీ తెలిపారు. 2015లో అతని మిత్రుడు పోతురాజుతో కలిసి చోరీలు చేస్తూ మొదటిసారి పట్టుబడ్డాడు.ఇటివలే నల్లకుంట, చిలకలగూడ పీఎస్ పరిధిలో సద్దాంపై రెండు చోరీ కేసులు నమోదు కాగా, వరంగల్ కమిషనరేట్ పరిధిలో అరెస్ట్ అయ్యాడు. 2017లో మరోసారి పోతురాజుతో కలిసి సద్దాం అలి 15చోరీలు చేసి అరెస్టయ్యాడు. 2020 జనవరిలో జైలు నుంచి విడుదలై రాగానే మళ్లీ చోరీలు ప్రారంభించినట్టు సీపీ తెలిపారు. సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పక్క ప్రణాళికతో సద్దాంను అరెస్ట్ చేశారని చెప్పారు. కాగా, నిందితుని నుంచి రూ.17లక్షల విలువ చేసే 45తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు.

Advertisement

Next Story