- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోడీ ప్రభుత్వానికి మద్దతుగా సచిన్ ట్వీట్
దిశ, స్పోర్ట్స్: సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ గత కొన్ని నెలలుగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. గణతంత్ర దినోత్సవం రోజు ట్రాక్టర్ల ర్యాలీ ప్రపంచ వ్యాప్తంగా రైతుల పోరాటాన్ని తెలియజెప్పింది. దీంతో అమెరికా పాప్ సింగర్ రిహానా, మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫా వంటి వాళ్లు రైతుల ఉద్యమానికి మద్దతు తెలుపుతూ ట్వీట్లు చేశారు. ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు ట్వీట్లు చేయడంతో మేల్కొన్న కేంద్ర హోం శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘రైతుల సమస్య పరిష్కరించడానికి చర్చలు జరుపుతున్నాము. ఈ విషయంలో దేశమంతా రైతులకు మద్దతు పలుకుతున్నది. ఇండియా అంతే ఒక్కటిగా ఉన్నది’ అని పేర్కొన్నది. దీనికి కొనసాగింపుగా సినిమా యాక్టర్లు, క్రికెటర్లు, సెలెబ్రిటీలు కూడా ట్వీట్ చేశారు.
దానిలో భాగంగా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ తన ట్విట్టర్‌లో ఒక పోస్టు పెట్టారు. ‘భారత దేశం యొక్క సార్వభౌమత్వం ఏనాడూ రాజీ పడదు. బయటి వ్యక్తులు కేవలం ప్రేక్షకులుగానే ఉండాలి తప్ప ఇందులో భాగస్వామ్యులు కారాదు. భారతీయులకు ఇండియా గురించి తెలుసు, వాళ్లే దేశానికి ఏం కావాలో నిర్ణయించుకుంటారు. మనం ఎప్పటికీ ఐక్యమత్యంగా ఉందాం’ అని ట్వీట్ చేశాడు. భారత ప్రభుత్వం ప్రస్తుతం ఎదుర్కంటున్న సమస్యల నుంచి బయట పడేయటానికి సచిన్ తనవంతు సాయం చేశాడు. కాగా ఈ ట్వీట్‌పై కూడా పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.