- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షాకింగ్.. ఒమిక్రాన్ ఎఫెక్ట్‌తో కరోనా టెస్టు రూ.4500
దిశ, డైనమిక్ బ్యూరో: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. గత మూడు నెలలుగా కరోనా వ్యాప్తి అదుపులోకి రావడంతో ఆంక్షలు సడలింపు చేయగా.. మహమ్మారి మరోసారి విజృంభించేందుకు రెడీ అవుతోంది. దీంతో వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు.. వైద్యశాఖతో పాటు పోలీస్ శాఖను అలర్ట్ చేశాయి. అయితే, కొత్త వేరియంట్ నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికులకు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తున్నారు. అయితే, టెస్టుల్లో నెగెటివ్ వస్తేనే ఇంటికి పంపిస్తారు. పాజిటివ్ వచ్చిన వారిని వెంటనే టిమ్స్‌కు తరలించి జీనోమ్ సీక్వెన్సింగ్‌కు శాంపిల్స్‌ను పంపిస్తున్న విషయం తెలిసిందే.
అయితే, ఎయిర్‌పోర్టులో నిర్వహించే ఆర్టీపీసీఆర్ టెస్టుకు భారీగా వసూలు చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఏకంగా ఆర్టీపీసీఆర్ టెస్టుకు సంబంధించిన రిపోర్టును 45 నిమిషాల్లో ఇస్తే రూ.4500, 8 గంటల్లో ఇస్తే రూ.2000 వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో సామాజికవేత్త విజయ్ గోపాల్ ట్విట్టర్ వేదికగా మంత్రి హరీష్ రావును, ఆర్జీఐఏ అధికారులకు, సైబరాబాద్ సీపీని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం సూచించిన ధరలకంటే ఎక్కువ రేటుకు టెస్టులు చేస్తున్నారని, ఎయిర్‌పోర్టు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా డీహెచ్ శ్రీనివాస్ రావుతో కూడా మాట్లాడినట్లు విజయ్ తెలిపారు. అయితే, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మూడు రోజుల క్రితం పార్లమెంటు వేదికగా ఎయిర్‌పోర్టులో టెస్టుల ధరల గురించి సభ దృష్టికి తీసుకొచ్చిన విషయం విధితమే.
Here’s the proof of looting passengers pic.twitter.com/KNlA8eEJPC
— Sunz (@sunnyy_024) December 4, 2021