- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
డిపోల ముందు ఆర్టీసీ కార్మికులు నిరసన ప్రదర్శన
by Shyam |

X
దిశ, తెలంగాణ బ్యూరో : ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు ఆర్టీసీ కార్మికులు నల్ల బ్యాడ్జీలతో డిపోల ఎదుట నిరసన తెలిపారు. అధికారుల వేధింపులు భరించలేక హైదరాబాద్లోని రాణిగంజ్–1 డిపో డ్రైవర్ తిరుపతిరెడ్డి మంగళవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఉదయం ఆర్టీసీ కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. డిపోల ఎదుట మౌనం పాటించి నివాళులర్పించారు.
Next Story