- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
Viral News: మామిడి రాజా.. ఈ చెట్టు 300 రకాల కాయలను పుట్టించింది..!

దిశ, వెబ్ డెస్క్: Viral News: ప్రస్తుతం మామిడిపండ్ల సీజన్ నడుస్తోంది. ఎండాకాలం వచ్చిందంటే మామిడి పండ్ల వాసన ఘుమఘుమలాడుతుంది. మామిడి చెట్లకు ఆకుపచ్చకాయలే కాదు పసుపు పచ్చ పండ్లూ వేలాడుతుంటాయి. అయితే ఒకే చెట్టుకు 300 రకాల మామిడి పండ్లు పండించాడో రైతు. ఏ ఊరుకో జోకులేయకు..ఒక చెట్టుకు 300 పండ్లు ఉంటాయ్..కానీ..300 రకాల పండ్లు ఏంటీ? అని అనుకుంటున్నారా? అవును ఇది నిజం. కావాలంటే పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఈ రైతు పేరు ఖలీం ఉల్లా ఖాన్. ఉత్తరప్రదేశ్ లోని మలీహాబాద్ ఊరు. ఆయనను మ్యాంగో మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తుంటారు. 120ఏళ్ల చెట్టుకు గ్రాప్టింగ్ పద్ధతిలో 300 రకాల మామిడి కాయలు కాయిస్తుంటారు. ఒక్కో కాయ భిన్న రుచిని కలిగి ఉంటుంది. హార్టికల్చర్ లో ఆయన క్రుషికి 2008లో పద్మశ్రీ అందుకున్నారు. కొత్త రకాలకు ఐశ్వర్యరాయ్, అనార్కలీ, సచిన్, మోడీ అంటూ ప్రముఖుల పేర్లను కూడా పెట్టారు. ప్రస్తుతం ఒకే చెట్టుకు 300రకాల మామిడి పండ్లు కాస్తున్నాయి. వాటిలో ఆల్ఫోన్సో, లాంగ్ , కేసర్ వంటి వాటితో పాటు ఈయన స్వయంగా కనిపెట్టిన హైబ్రిడ్ రకాలు కడూా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎంతో తీపిగా ఉంటాయి.
అంటు కట్టడం ద్వారా తాను కనిపెట్టిన మామిడిపండ్లకు సెలబ్రిటీల పేర్లు కూడా పెట్టారు. ఈ రకం మామిడిపండుకు సచిన్ టెండూల్కర్, ఇంకో రకానికి ఐశ్వర్యరాయ్..మరోరకం దానికి మోడీ, తోతాపూరికి అమితాబచ్చాన్ అనే పేరు పెట్టారు. నారింజ రంగులో వచ్చే మామిడిపండుకు నరేంద్రమోడీ అని పేరును పెట్టారు. ఈ రైతు వయస్సు 84 సంవత్సరాలు. ఇతనికి సాయంగా అతని కుమారుడు ఉంటున్నారు. ప్రస్తుతం వీరు 22 ఎకరాల విస్తీర్ణంలో మామిడితోటలను పెంచుతున్నారు.