- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అతడితో ఉన్న వీడియో షేర్ చేస్తూ గుడ్ న్యూస్ చెప్పిన మెగా బ్యూటీ.. ఆమెకు దూరంగా ఉండు అన్నా అంటూ నెటిజన్ల కామెంట్స్

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కృతి శెట్టి (Kriti Shetty)అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు ‘ఉప్పెన’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్(Shyam Singha Roy), బంగారాజు, వంటి చిత్రాల్లో నటించి హిట్స్ తన ఖాతాలో వేసుకుని పాపులారిటీ పెంచుకుంది. ఇక చివరగా ‘మనమే’ మూవీతో ప్రేక్షకులను అలరించిన ఆమె తెలుగులో అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్ చెక్కేసింది. ప్రస్తుతం కృతిశెట్టి వా వాతియార్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ(Love Insurance Company) వంటి చిత్రాలతో ప్రేక్షకుల రాబోతుంది. ఇక షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ సినిమాలో ఇటీవల ‘డ్రాగన్’ హిట్ సాధించిన ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan)హీరోగా నటిస్తుండటం విశేషం.
అయితే ఈ మూవీని నయనతార భర్త కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్(Vignesh Sivan) తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, కృతి శెట్టి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియోను షేర్ చేస్తూ గుడ్ న్యూస్ ప్రకటించింది. ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ సినిమా షూటింగ్ పూర్తి అయినట్లు తెలుపుతూ ప్రదీప్, విఘ్నేష్‌తో పాటు మూవీ టీమ్ అందరితో కలిసి కనిపించింది.అలాగే మా చిత్రం మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాము.. మిమ్మల్ని ప్రేమిస్తున్నాం అని తెలిపింది. ఇక అది చూసిన నెటిజన్లు కొందరు హార్ట్ సింబల్స్ షేర్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం ‘ఉప్పెన’ మూవీ చూశావుగా కాస్త ఆమెకు దూరంగా ఉండు అన్నా అని కామెంట్లు చేస్తున్నారు.