ప్రభాకర్ రెడ్డిది ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారం అనుకున్నా.. జ్యోతిష్యం కూడా చెబుతున్నారు: పొన్నం కౌంటర్

by Mahesh |
ప్రభాకర్ రెడ్డిది ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారం అనుకున్నా.. జ్యోతిష్యం కూడా చెబుతున్నారు: పొన్నం కౌంటర్
X

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (MLA Kotha Prabhakar) కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని వ్యాపారస్తులు చూస్తున్నారని చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) సెటైరికల్ కౌంటర్ వేశారు. ఆయన శంషాబాద్ నోవాటెల్‌లో జరుగుతున్న సీఎల్పీ సమావేశానికి ముందు మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. కొత్త ప్రభాకర్ రెడ్డిది ట్రాన్స్ పోర్ట్ వ్యాపారం (Transport business) అనుకున్నా.. కానీ ఈ మధ్య జ్యోతిష్యం కూడా చెబుతున్నారని సెటైర్లు (satyrs) వేశారు. అలాగే బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని కూలుస్తాం అంటే ఊరుకుంటామా అని మండిపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతామంటే.. ఇక్కడ ఎవరు చేతులు కట్టుకుని కూర్చోలేదని తీవ్ర స్థాయిలో మంత్రి పొన్నం వార్నింగ్ (Minister Poonam warning) ఇచ్చారు. ఈ నెల 27 వరంగల్‌లో నిర్వహించే బీఆర్ఎస్ ఆవిర్భావ సభ (BRS founding meeting) నేపథ్యంలో సోమవారం తొగుట మండలం లో పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ (Congress party)పై ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారి, అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని, ఆ ఖర్చుకు డబ్బులు కూడా ఇస్తామంటున్నారని, రాష్ట్రంలో చిన్న పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు.



Next Story

Most Viewed