Loc: మరోసారి పాక్ కవ్వింపు చర్యలు.. వరుసగా రెండో రోజూ ఎల్ఓసీ వద్ద కాల్పులు

by vinod kumar |
Loc: మరోసారి పాక్ కవ్వింపు చర్యలు.. వరుసగా రెండో రోజూ ఎల్ఓసీ వద్ద కాల్పులు
X

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం దాడి తర్వాత భారత్ తీసుకుంటున్న కఠిన చర్యలతో పాక్ నిరాశకు గురవుతోంది. ఈ క్రమంలోనే పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. వరుసగా రెండు రోజుల పాటు కాల్పుల విరమణను ఉల్లంఘించింది. ఏప్రిల్‌ 25-26 అర్ధరాత్రి నియంత్రణ రేఖ (LOC) వెంబడి పాక్ కాల్పులకు తెగపడినట్టు భారత ఆర్మీ అధికారులు తెలిపారు. తేలికపాటి ఆయుధాలతో కాల్పులు జరపగా.. ఇండియన్ సైన్యం సైతం పాక్‌కు ధీటుగా బదులిచ్చిందని, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, సైనికులెవరికీ గాయాలు కాలేదని పేర్కొన్నారు. అంతకుముందు కూడా పాక్ పలు ప్రాంతాల్లో కాల్పులు జరిపింది. పాకిస్తాన్ చేసే ఏ చర్యనైనా తిప్పికొట్టడానికి భారత సైన్యం పూర్తిగా అప్రమత్తంగా, సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలోనే కాల్పుల విరమణ జరగడం గమనార్హం.



Next Story

Most Viewed