అందుకు భారత్​ సమ్మిట్​ ఒక వేదిక మాత్రమే కాదు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

by Ramesh Goud |
అందుకు భారత్​ సమ్మిట్​ ఒక వేదిక మాత్రమే కాదు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన భారత్ సమ్మిట్ కు మిమ్ములందరినీ ఆహ్వానించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం హెచ్​ఐసీసీలో జరిగిన భారత్ సమ్మిట్ లో ఆయన మాట్లాడారు. భారీ గ్లోబల్ సమ్మిట్ హైదరాబాద్ లో నిర్వహించడం గొప్ప అవకాశంగా భావిస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచే ప్రజల కేంద్రంగా అనేక కార్యక్రమాలు చేపట్టామని, వారే కేంద్రంగా పరిపాలన సాగిస్తున్నామని అన్నారు. అణగారిన, పేద వర్గాల కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. మా ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు చెప్పుకునేందుకు భారత సమ్మిట్ ఒక వేదిక మాత్రమే కాదు.. అనేక విషయాలు నేర్చుకునేందుకు ఉపయోగపడింది కూడా అన్నారు. అహింస, స్వతంత్రం శాంతి, మా గౌరవ నాయకుని విజన్ న్యాయం వంటి అంశాలను గ్రహించామన్నారు. ఇప్పటికే వీటిని కొనసాగిస్తున్నామని, భవిష్యత్తులో మా పాలసీలు, పథకాలు, మరింత సమర్థవంతంగా కొనసాగిస్తామన్నారు.



Next Story