- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > నాచు వల్ల వాగులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. తప్పిన పెను ప్రమాదం
నాచు వల్ల వాగులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. తప్పిన పెను ప్రమాదం
by Sridhar Babu |
X
దిశ, కొడిమ్యాల: వేములవాడ నుంచి జగిత్యాల వెళ్లే మార్గమధ్యలో కొడిమ్యాల నాచుపల్లి వద్ద ఉన్న చిలుకవాగులో బస్సు అదుపు తప్పి వాగులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎవరు గాయపడనప్పటికీ అనుకోకుండా జరిగిన ఈ పరిణామానికి ప్రయాణికులు భయాందోళన చెందారు. గతంలో కురిసిన భారీవర్షాలకు చిలుకవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. కొద్దిరోజుల నుంచి ఈ రోడ్డును అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. వరద ఉధృతి తగ్గడంతో వాహనాలను అనుమతించినప్పటికీ రోడ్డుపైన గుంతలు పడి నాచు తయారై పూర్తిగా పాడైన కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు వెంటనే స్పందించి ఇక ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని, వరద నీరు తగ్గిన వెంటనే వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
Advertisement
Next Story