తెరపైకి ‘ధ్యాన్ చంద్’ జీవితం

by Shyam |   ( Updated:2020-12-15 06:04:41.0  )
తెరపైకి ‘ధ్యాన్ చంద్’ జీవితం
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌజ్ ఆర్‌ఎస్‌వీపీ మూవీస్.. ఇండియాస్ ప్రైడ్ స్టోరీని ఎంచుకుంది. 1500 ప్లస్ గోల్స్, మూడు ఒలంపిక్ గోల్డ్ మెడల్స్‌తో భారత్‌కు గర్వకారణంగా నిలిచిన హాకీ ప్లేయర్ ధ్యాన్ చంద్ జీవితకథను తెరపై ఆవిష్కరించబోతోంది. అభిషేక్ చౌబే దర్శకత్వం వహించనున్న ఈ సినిమా 2021లో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సందర్భంగా మాట్లాడిన డైరెక్టర్.. హాకీలో భారతజాతి గర్వించదగిన ప్లేయర్ ధ్యాన్ చంద్ బయోపిక్ తెరకెక్కించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. తన ప్రతీ అచీవ్‌మెంట్ కూడా సపరేట్ స్టోరీగా సినిమా తీయొచ్చని.. అలాంటి వ్యక్తి బయోపిక్‌ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రోనీ స్క్రూవాలా లాంటి నిర్మాతలు దొరకడం ఆనందంగా ఉందన్నారు. కాగా ధ్యాన్ చంద్ పాత్రలో ఓ స్టార్ హీరోను తీసుకోబోతున్నట్లు సమాచారం. కాగా ధ్యాన్ చంద్ గ్రేటెస్ట్ లైఫ్ అచీవ్‌మెంట్స్‌ గురించి అభిషేక్ కంటే గొప్పగా ప్రజెంట్ చేసే వారు మరొకరు ఉండరని భావిస్తున్నట్లు ప్రొడ్యూసర్ రోనీ స్క్రూవాలా తెలిపారు. ‘సోంచిరియా’ తరువాత అతనితో మళ్ళీ పనిచేయడం ఆనందంగా ఉందన్నారు.

Advertisement

Next Story