ఈటల కోసం భారీ స్కెచ్.. రంగంలోకి అనుబంధ సంఘాలు.. గెలుపు పక్కా.?

by Anukaran |
Eatala-Rajender
X

దిశ ప్రతినిధి, కరీంనగర్, హుజురాబాద్ : హుజురాబాద్ ఎన్నికల్లో చాపకింద నీరులా దూసుకపోయే భారీ వ్యూహంతో బీజేపీ పావులు కదుపుతోంది. పబ్లిక్‌గా తిరుగుతూ ప్రచారం చేసే కమలనాథులే కాకుండా సంఘ్ పరివార్ కూడా గ్రౌండ్ లెవల్ క్యాంపెయిన్‌కు శ్రీకారం చుట్టబోతోంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS), విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ)లతో పాటు ఇతర అనుబంధ సంస్థలకు చెందిన వారు కార్యరంగంలోకి దిగనున్నారు.

300 నుండి 350 మంది హుజురాబాద్, ఇల్లందకుంట, జమ్మికుంట, వీణవంక, కమలాపూర్ మండలాల్లో వీరు వ్యూహాత్మకంగా ప్రచారం చేసేందుకు కార్యాచరణ రూపొందిచినట్టుగా తెలుస్తోంది. 60 మంది ఓటర్లకో ఇంఛార్జీగా వ్యవహరించే వీరు బీజేపీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా వ్యక్తిగతంగా కలిసి ప్రచారం చేయనున్నట్టు సమాచారం.

జాబితా సిద్ధం..

హుజురాబాద్ ప్రాంతంలో RSS అనుబంధ విభాగాలకు చెందిన కుటుంబాల వివరాలను సేకరించి జాబితాను తయారు చేసినట్టుగా తెలుస్తోంది. వీరందరిని కలిసేందుకు అవసరమైన కార్యాచరణ తయారు చేసుకున్న వీరు.. వారి బంధువులను, స్నేహితులను వ్యక్తిగతంగా కలిసి మౌత్ టూ మౌత్ పబ్లిసిటీ చేయనున్నారని సమాచారం. వీరితో పాటు హుజురాబాద్ ప్రాంతంలో పనిచేసే RSS అనుబంధ సంఘాలకు చెందిన వారిని కూడా సీక్రెట్ ప్రచారంలో భాగస్వాములను చేయనున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed