అంగీకార మతమార్పిడులకు ఓకే

by Shyam |   ( Updated:2020-02-09 21:07:46.0  )
అంగీకార మతమార్పిడులకు ఓకే
X

మత మార్పిడులపై ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి సురేశ్ భయ్యాజీ జోషి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గోవా రాజధాని పనాజీలో ‘‘ విశ్వగురు.. ఆర్ ఎస్‌ఎస్ దృష్టికోణం’’ అనే అంశంపై జరిగిన సదస్సులో భయ్యాజీ మాట్లాడుతూ..‘‘ ఎవరైనా తమ అంగీకారంతో క్రైస్తవ మతంలోకి మారితే మంచిదే. అయితే పేదరికం, నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకొని బలవంతపు మత మార్పిడులను చేస్తే ఆర్‌ఎస్‌ఎస్ ఉపేక్షించబోదు’’ అని సురేశ్ భయ్యాజీ స్పష్టం చేశారు. క్రైస్తవ మతంలోకి మార్పిడులు బలవంతంగా జరుగుతున్నట్లు ఆయన ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed