- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బహుజన డాక్టర్లపై సీఎం కేసీఆర్ కుట్ర.. జైలుకు పంపిస్తామని RSP వార్నింగ్!
దిశ, డైనమిక్ బ్యూరో: గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బహుజన ప్రభుత్వ వైద్యుల జీవితాలతో సీఎం కేసీఆర్ ఆడుకుంటున్నారని మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం సీక్రెట్‌గా జీవో నెం.155ను తీసుకొచ్చిన నేపథ్యంలో శనివారం ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం జీవో నెం.27ను పునరుద్ధరించకుండా కాళోజీ వైద్య విశ్వవిద్యాలయంలో అడ్మిషన్లను రిలీజ్ చేయడం సరికాదన్నారు. కేవలం నాలుగు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోనే పరిమిత సంఖ్యలోనే పీజీ సీట్లు అలాట్ చేశారన్నారు. దీంతో కేవలం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న బహుజన డాక్టర్లు ఉన్నత పదవులకు అర్హులు కాకుండా ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. మీకు కావాల్సిన వ్యక్తి సీనియారిటీ లిస్టులో 54 స్థానంలో ఉన్నప్పటికీ, వైద్య విద్యలో అత్యున్నత స్థానానికి ప్రమోట్ చేసినప్పుడే ప్రభుత్వానికి బీసీ, ఎస్సీ, ఎస్టీల పట్ల ఉన్న కపట ప్రేమ, వివక్ష బయటపడిందన్నారు. మా టైం వస్తుందని, రాబోయే బహుజన రాజ్యంలో బహుజనులపై జరిగిన ప్రతి అన్యాయంపై ఉన్నత స్థాయి విచారణ జరిపి దోషులనందరినీ బరాబర్ జైలుకు పంపిస్తామని ఆర్ఎస్పీ హెచ్చరించారు.
https://twitter.com/RSPraveenSwaero/status/1462015116350668803?s=20