అసైన్డ్ భూములేమైనా మీ తాతల జాగీరా కేసీఆర్ : RSP ఫైర్

by Shyam |   ( Updated:2021-12-05 03:46:25.0  )
అసైన్డ్ భూములేమైనా మీ తాతల జాగీరా కేసీఆర్ : RSP ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : దళితులను అణచివేయడంలో కేసీఆర్ ప్రభుత్వం అగ్రభాగాన ఉందని బీఎస్పీ స్టేట్ కోఆర్డినేటర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా లింగంపల్లిలో ఇండస్ట్రీ పేరుతో దాదాపుగా దళితులు, గిరిజనుల 600 ఎకరాల అసైన్డ్ భూమిని ప్రభుత్వం లాక్కొని కొందరు పారిశ్రామికవేత్తలకు దొంగచాటుగా కట్టబెడుతోందని ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ అసైన్డ్ భూములేమైనా మీ తాతల జాగీరా అని ప్రశ్నించారు. ఈ దారుణాలను ఆపాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల జీవితాలను ఛిద్రం చేస్తున్న ఈ కబ్జాల టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని చిత్తుచిత్తుగా ఓడించి దోపిడి లేని బహుజన రాజ్యాన్ని స్థాపిద్దామని తెలిపారు.

తొండలు కూడా గుడ్లు పెట్టని భూములను పేదలకు ఇచ్చి ఊరంతా చాటింపేసుకుంటున్నారని మండిపడ్డారు. ఆ భూములను నడ్డివిరిగేలా పనిచేసి చదును చేసుకున్నాక అసైన్డ్ ల్యాండ్ అని భూములు తిరిగి లాక్కొని కొందరు టీఆర్ఎస్ తొత్తులకు ఇస్తున్నారని.. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. ఇదిలావుండగా దళితులపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. మరియమ్మ, వీరశేఖర్, ఇప్పుడు రొయ్య శ్రీనివాస్.. దేశంలో ఇంతకన్నా దళిత వ్యతిరేక సర్కార్ ఏదైనా ఉంటుందా అని ఆగ్రహం వ్యక్తంచేశారు.

Advertisement

Next Story

Most Viewed