రక్షణ రంగంలో పరిశోధనలకు రూ.499 కోట్లు

by Shamantha N |
రక్షణ రంగంలో పరిశోధనలకు రూ.499 కోట్లు
X

న్యూఢిల్లీ: రాబోయే ఐదేండ్లలో రక్షణ రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణల నిమిత్తం రూ.499 కోట్ల బడ్జెట్‌‌కు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం ఆమోదం తెలిపారు. ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్స్ లెన్స్, డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ (డీఐఓ)లకు వచ్చే ఐదేండ్ల కాలానికి రూ. 498.8కోట్ల బడ్జెట్‌కు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోద ముద్రవేసినట్టు రక్షణ శాఖ వెల్లడించింది. రక్షణ రంగంలో స్వయం స్వాలంబన టార్గెట్‌‌తో 300 స్టార్టప్‌లు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ)లకు ఆవిష్కరణల కోసం ఆర్థిక సహాయం అందించేందుకు ఈ నిధులు సహాయపడుతాయని వెల్లడించింది. మిలిటరీ హార్డ్ వేర్, ఆయుధాలను తగ్గించడంతో పాటు భారత్‌ను ఢిఫెన్స్ మ్యాన్ ఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చే ప్రయత్నాల్లో ఈ పథకాన్ని రూపొందించినట్టు రక్షణ శాఖ తెలిపింది. రక్షణ, ఏరోస్పేస్ రంగంలో వాటి అవసరాలకు అనుగుణంగా ఆవిష్కరణ, స్వదేశీ సాంకేతిక అభివృద్ది పెంపొందించడమే లక్ష్యంగా రక్షణ ఉత్పత్తి విభాగం(డీడీపీ) ఐడెక్స్ ఫ్రేమ్ వర్క్, డీఐఓలను ఏర్పాటు చేస్తున్నట్లు రక్షణ శాఖ పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed