నిరుపేద కుటుంబానికి రూ.25000 ఆర్థిక సహాయం

by Shyam |
నిరుపేద కుటుంబానికి రూ.25000 ఆర్థిక సహాయం
X

దిశ, రంగారెడ్డి: వాళ్లంతా కలిశారు.. ఒక నిర్ణయానికి వచ్చారు. అనంతరం ఓ నిరుపేద కుటుంబంలో జరుగుతున్న కార్యక్రమానికి సాయం చేసి వెలుగులు నింపారు. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలో జిల్లా గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ సభ్యులు, జెడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్.. కడ్తల్ మండలం కానుగుబావి తండాకు చెందిన ముడవత్ చందర్ కుమార్తె వివాహానికి రూ. 25000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శారదా పాండునాయక్, సింగిల్ విండో డైరెక్టర్ సేవ్య నాయక్, వార్డ్ మెంబెర్ లక్ష్మణ్, గంప శ్రీను, నర్సింహా, శ్రీను, తండా వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story