అడవుల పునరుజ్జీవానికి భారీ బడ్జెట్..!!

by Shyam |
అడవుల పునరుజ్జీవానికి భారీ బడ్జెట్..!!
X

దిశ, తెలంగాణ బ్యూరో: అభివృద్ధి పేరుతో అడవులు, పచ్చదనం, పర్యావరణాన్ని పణంగా పెడుతూ అభివృద్ధి అన్నారని, రాష్ట్ర విస్తీర్ణంలో అడవుల శాతం 33 శాతానికి పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. 2015లో మొదలు పెట్టిన హరితహారం కార్యక్రమం ద్వారా రాబోయే రోజుల్లో 10 లక్షల 50 వేల ఎకరాల అడవుల పునరుద్ధరణ లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. అందులో భాగంగా నగరాల్లో, పట్టణాల్లో అర్బన్ పార్కులను, గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాల పేరుతో అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. దీని ద్వారా ఇప్పటి వరకూ 3.67 శాతం మేర అడవుల విస్తీర్ణాన్ని పెంచినట్లు ఫారెస్టు సర్వే ఆఫ్ ఇండియా గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్ర బడ్జెట్ 2021-22 లో రూ.1,276 కోట్లను అటవీ శాఖకి కేటాయించింది. గతేడాది బడ్జెట్ లో రూ.1,091 కోట్లను హరితహారం, అటవీ శాఖలకు కేటాయించింది. కాగా ప్రస్తుత కేటాయింపులతో అడవుల పునరుజ్జీవానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేసిందనే చెప్పాలి.

Advertisement

Next Story

Most Viewed