- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్‌పై ఆర్పీ పట్నాయక్ సంచలన కామెంట్స్
దిశ, డైనమిక్ బ్యూరో : స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తూ రోడ్డుపై ప్రమాదానికి గురైన సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నా .. ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు పోలీసులు. అయితే అతివేగం, రాష్ డ్రైవింగ్, రోడ్డుపై ఇసుక కారణంగానే స్పోర్ట్స్ బైక్ అదుపు తప్పిందన్న అంశాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ ప్రమాద ఘటనపై సంగీత దర్శకుడు, నటుడు ఆర్పీ పట్నాయక్ ఫేస్ బుక్ వేదికగా స్పందించారు. ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఆయన చేసిన పోస్ట్‌లో ‘‘Request the police, a simultaneous efforts to file a case against the construction company which is the reason for accumulation of sand on the road and also against the municipality for not keeping the road clean as and when, while filing a case against Saidharam Tej for speeding.
This action may help to alert other construction activities in other areas of the city to be careful’’. అని ఉంది.
సాయిధరమ్ తేజ్‌పై అతివేగం కింద కేసు నమోదు చేసిన పోలీసులు, అదే సమయంలో అక్కడ రోడ్డుపై ఇసుక పేరుకు పోవటానికి కారణమైన కన్‌స్ట్రక్షన్ కంపెనీపై, ఎప్పటికప్పుడు రోడ్డుని క్లీన్‌గా ఉంచాల్సిన మున్సిపాలిటీపై కూడా కేసు పెట్టాలి. ఈ కేసు వల్ల నగరంలో మిగతా ఏరియాల్లో ఇలాంటి అజాగ్రత్తలు పాటించేవాళ్లు అప్రమత్తమై జాగ్రత్తలు తీసుకుంటారని నా అభిప్రాయం అని పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు ఆర్పీకి మద్దతు పలుకుతున్నారు. జీహెచ్ఎంసీ, సంబంధిత కన్‌స్ట్రక్షన్ కంపెనీపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.