- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తన చెల్లితో అసభ్యంగా మాట్లాడొద్దన్నందుకు కత్తి పోట్లు
by Sumithra |

X
దిశ, క్రైమ్‌బ్యూరో: తన చెల్లితో అసభ్యంగా మాట్లాడొద్దని వారించిన యువకుడిపై కత్తితో దాడి చేశారు. చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనకు సంబంధించి ఇన్స్‌పెక్టర్ రుద్రభాస్కర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఘాజీ మిల్లత్‌కాలనీలో ఓ బాలికపట్ల ముస్తఫా అనే వ్యక్తి అసభ్యకరంగా మాట్లాడారు. ఈ విషయం తెలిసిన బాలిక సోదరుడు ముస్తఫాతో గొడవకు దిగడంతో విషయం తెలుసుకున్న ముస్తఫా సోదరుడు రౌడీషీటర్ అబ్దుల్లా ఆదివారం రాత్రి యువకుడిపై కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాలైన యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Next Story