ఓటీఎస్ రగడ.. చంద్రబాబుపై రోజా తీవ్ర విమర్శలు

by srinivas |   ( Updated:2021-12-13 05:01:00.0  )
roja
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఓటీఎస్‌ రగడ రాజుకుంటూనే ఉంది. ఓటీఎస్ పై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఓటీఎస్ పేదలకు ఓ వరమని ప్రభుత్వం చెప్తుంటే.. వసూళ్ల కోసమేనంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంతేకాదు రూపాయి కూడా కట్టొద్దని టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇదే అంశంపై వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా ఘాటుగా స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇప్పటికైనా ప్రతిపక్షనేతగా హుందాగా వ్యవహరిస్తే కనీస గౌరవం అయినా దక్కుతుందని వ్యాఖ్యానించారు.

జగన్ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే ఓర్వలేని చంద్రబాబు చౌకబారు విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైయస్ రాజశేఖర్‌రెడ్డి రెండు అడుగులు ముందుకు వేస్తే.. ఇప్పుడు వైఎస్ జగన్ నాలుగడుగులు ముందుకు వేస్తున్నారని స్పష్టం చేశారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు కనీసం 14 మందికి కూడా ఇళ్లపై హక్కు కల్పించలేకపోయారని రోజా ఎద్దేవా చేశారు. రిజిస్ట్రేషన్‌తో పాటు సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని అమలు చేయడాన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని విమర్శించారు. ఓటీఎస్ బలవంతం కాదని స్వచ్ఛందం అని చెప్పుకొచ్చారు. ప్రజలే స్వచ్చందంగా చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. డబ్బులు కట్టొద్దు అని అంటున్నారే తప్ప వన్ టైం సెటిల్మెంట్‌ను ఎవరూ వ్యతిరేకించడం లేదని ఎమ్మెల్యే రోజా అభిప్రాయపడ్డారు. చంద్రబాబుకు ప్రతీదీ రాద్దాంతం చేయటం అలవాటుగా మారిందన్న రోజా.. చంద్రబాబు ఏనాడైనా పేదవాడికి ఉపయోగపడే ఒక్క పథకాన్నైనా తీసుకువచ్చారా అని నిలదీశారు.

More Interesting News :

ప్రాణాలతో ఆడుకున్న చిన్నోడు.. 8 ఏళ్లకే ఎన్ని హత్యలు చేశాడంటే…!

Advertisement

Next Story