- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోహిత్ శర్మను విరాట్ సైతం టచ్ చేయలేకపోయాడు..!
X
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా పరిమిత ఓవర్ల ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ తన రికార్డును పదిలపరుచుకున్నాడు. వరుసగా ఎనిమిదవ ఏడాది కూడా వన్డేల్లో కూడా టీమ్ ఇండియా తరపున అత్యధిక స్కోర్ చేసిన బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది రోహిత్ ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన సిరీస్ మాత్రమే ఆడాడు. జనవరి 19న ఆడిన వన్డేలో అతడు 119 పరుగులు సాధించాడు. ఆ తర్వాత ఒక్క వన్డే కూడా ఆడలేదు. టీమ్ ఇండియా కూడా ఆ తర్వాత న్యూజీలాండ్‌తో సిరీస్ ఆడింది. తాజాగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ముగించింది. అయినా సరే రోహిత్ పరుగులను ఎవరూ అధిగమించలేదు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా కొట్టిన 92 పరుగులే అత్యధికం. దీంతో గత ఎనిమిదేళ్లుగా రోహిత్ రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేకపోయారు.
గత వన్డేల్లో రోహిత్ శర్మ స్కోర్లు:
2013 – 209
2014 – 264
2015 – 150
2016 – 171*
2017 – 208*
2018 – 152
2019 – 159
2020 – 119
Advertisement
Next Story