- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ఆరుగురు మృతి
by Sumithra |

X
దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి లారీ బోల్తాపడింది. దీంతో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందగా, మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. లారీ కింద చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులందరూ శంషాబాద్ మండలం సుల్తాన్‌పల్లి ఇటుక బట్టీల్లో పనిచేసే కూలీలుగా గుర్తించారు. వీరందరు నిత్యావసరాలు కొనేందుకు శంషాబాద్ మార్కెట్‌కు లారీలో వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్పష్టం చేశారు. డ్రైవర్ మద్యం తాగి నడిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story