ఉదయాన్నే కూలీకి వెళ్తున్న కార్మికులు.. అంతలోనే

by Sridhar Babu |
ఉదయాన్నే కూలీకి వెళ్తున్న కార్మికులు.. అంతలోనే
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఇద్దరు వలసకూలీలు మృతి చెందిన ఘటన శనివారం తెల్లవారు జామున జరిగింది. మృతులు నాందేడ్ జిల్లా మహారాష్ట్రకు చెందిన సందీప్ చౌహన్ (18), ధనజీ (14) గా గుర్తించారు. బిల్డింగ్ కాంట్రాక్షన్ పనిపై వలస వచ్చిన వీరు జగిత్యాల జిల్లా కథలపూర్ మండలం కలికోటలో నివాసం ఉంటున్నారని సమాచారం. ఈ ఘటనకు కారణమైన వాహనాన్ని గుర్తించాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed